Union Minister Kishan Reddy : వరి ధాన్యం కొనుగోలు విషయంలో (Paddy procurement) టీఆర్ఎస్ ప్రభుత్వానికి,బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం యాసంగి వడ్లు కొనమని చెబుతోందని సీఎం కేసీఆర్,మంత్రులు పదేపదే ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే యాసంగి వరి కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ తీసుకురావాలంటూ సవాల్ విసురుతున్నారు.మరోవైపు బీజేపీ నేతలు కూడా సీఎం కేసీఆర్‌కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.తాజాగా ఇదే అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ (KCR) తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను రైతులకు తెలియజేస్తామన్నారు. 2014కి ముందు అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు.కేంద్రంలో మోదీ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఒక్క తెలంగాణ నుంచే కేంద్రం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందన్నారు.దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం అత్యధికంగా ధాన్యం సేకరిస్తోందన్నారు.


తెలంగాణలో (Telangana) బాయిల్డ్ రైస్ ఎవరూ తినరని... రైతులు కూడా బాయిల్డ్ రైస్ పండించరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసేది మిల్లర్లేనని అన్నారు. ముడి బియ్యం ఇస్తే కేంద్రం ఎంతైనా కొనుగోలు చేస్తుందని అన్నారు. గతేడాది 44.75లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందన్నారు.


Also Read:MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిని అంచనా వేయడంలో టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు. సెప్టెంబర్ 29న కేంద్రానికి రాసిన లేఖలో 108 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చునని అంచనా వేశారన్నారు. సరైన సర్వే నిర్వహించకుండా బాధ్యతారాహిత్యంగా ధాన్యం ఉత్పత్తిపై అంచనాలు పంపించారని మండిపడ్డారు. ప్రతీ ఏటా ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు.


Also Read:Etela Rajender News: ఈటల రాజేందర్ కు షాక్.. అసైన్డ్ భూముల వ్యవహారంలో మరోసారి నోటీసులు


ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించే విధానాలు మానుకోవాలని కిషన్ రెడ్డి (Telangana BJP) టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. ధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నాలు చేస్తామంటే.. అక్కడ ఎవరికీ భయపడే ప్రభుత్వం లేదన్నారు.ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం,బ్యాంకులు సహకరిస్తాయన్నారు.పెట్రోల్,డీజిల్ ధరల విషయంలోనూ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయన్నారు. జీఎస్టీ ఆదాయం పడిపోయినందునా తప్పనిసరి పరిస్థితుల్లోనే సెస్ పెంచాల్సి వచ్చిందన్నారు.ఇప్పుడు ఆదాయం మెరుగుపడినందునా పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రయత్నం చేశామన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook