Telangana BJP Chief Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ టూర్ వేయడంతో అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు అంటూ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. తామంతా ఒక కుటుంబం అని.. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజమని అన్నారు. కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదని.. సీబీఐ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఈ కేసులో ఆధారాలు ఉండడంతోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించామని గుర్తు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను ఎంఐఎం ‌పార్టీ నడిపిస్తోందన్నారు కిషన్ రెడ్డి. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబుర పడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని.. నోట్ల రద్దులో తమ ప్లాన్ తమకు ఉందని స్పష్టంచేశారు. కర్ణాటక ఎన్నికల‌ ప్రభావం తెలంగాణలో ఉండదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని.. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. 


"అకాల వర్షాలతో పంట కోత సమయంలో రైతులు నష్టపోయారు. ఏపీలో పంటల బీమా తో రైతుకు చేయూత లభిస్తుంది. తెలంగాణలో పంటల బీమా లేదు. దీంతో ప్రభుత్వ సహకారం లభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. తెలంగాణలో పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ వస్తోంది. కేంద్రం ఏమిస్తుంది..? అని ప్రశ్నించడానికే బీఆర్ఎస్‌కు సమయం సరిపోవడం లేదు. తెలంగాణ ప్రజల కష్టాలపై ప్రభుత్వానికి దృష్టి లేదు. రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారు. మహారాష్ట్రలో తలమసినోళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఫ్లెక్సీల్లో వేసుకుంటే దేశ్ కి నేత కాలేరు. 


కేసీఆర్ ఎకరాకు పదివేలు మాత్రమే ఇస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఎకరాకు కేవలం ఎరువుల సబ్సిడీతోనే 18 వేల 254 రూపాయలు ఇస్తుంది. కేసీఆర్ ఎరువులు ఉచితంగా ఇస్తానని చెప్పారు... ఏమైంది..? రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎరువుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం వేయడం లేదు. ప్రతీ బస్తా మీద ధరలు ముద్రిస్తున్నాం. రైతులకు ఇచ్చిన మాట కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడం లేదు..? గురువింద గింజ సామెతలా ఉంది కేసీఆర్ తీరు.. ఉట్టికి ఎగరలేని వారు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది కేసీఆర్ వైఖరి. డిజిటల్ ట్రాన్సక్షన్‌లో భారతదేశం నెంబర్ వన్‌గా నిలిచింది. వేప పూత పూసిన యూరియా ద్వారా పంట దిగుబడి పెరిగింది. రూ.10 వేలు ఇస్తున్నామని బీఆర్ఎస్ డబ్బా కొట్టుకోవడం తప్పా.. ఏమి చేయడం లేదు.." అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.


Also Read: Teachers Dress Code: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. టీచర్లకు సరికొత్త డ్రెస్ కోడ్.. జీన్స్‌, టీషర్టులు, లెగ్గింగ్స్‌ నిషేధం..!  


Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook