తెలంగాణ ఏర్పాటులో తన ప్రాత గురించి వివరించిన టి పీసీసీ చీఫ్ ఉత్తమ్
తెలంగాణ ఉద్యమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ది ప్రేక్షక పాత్ర మత్రమేని టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను గురించి టీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను 15 ఏళ్లకే దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో వెళ్లానని.. ప్రాణాలను సైతం తెగించి యుద్ధ పైలట్ గా పనిచేశారన్నారు. తన మిగిలిన జీవితం తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తమ్ వివరణ ఇచ్చారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను కూడా కీలక పాత్ర పోషించాన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పందించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారని వివరణ ఇచ్చారు. తాను చేసిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ భ్రమల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పోరాటం, సోనియా నిబద్ధత వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదా అంటూ ఉత్తమ్ కుామార్ రెడ్డి ప్రశ్నించారు.