Vaccination Mistakes in Telangana: కరోనా మహామ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మన అందరికి తెలిసిందే, కరోనా మహమ్మారి ఉదృతి తగ్గినా.. టీకా పంపిణీ కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న అధికారుల తప్పిదాలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంద శాతం వ్యాక్సిన్ పంపిణీ 100 శాతం ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.. కానీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా మరణించిన వ్యక్తికీ కరోనా టీకా వేసినట్టు ధృవీకరించటం నిర్లక్ష్యానికి అద్దం  పడుతుంది. 


Also Read: Watch: ధావన్‌ బ్యాటింగ్ స్టైల్‌పై కోహ్లీ వీడియో..ఫిదా అవుతున్న నెటిజన్స్


వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌ గ్రామంలో నివాసముంటున్న గుండ మల్లేశం(68)కు  కోనరావుపేట చెందిన అరోగ్య కేంద్రంలో ఏప్రిల్‌ 23న టీకా మొదటి డోసు వేసుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ఆరోగ్య బాగోలేక ఆగస్టు 7 వ తేదీన మరణించాడు. 


అయితే అక్టోబర్ 12 న రెండో టీకా వేసుకున్నట్టు అతడి మొబైల్ సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది అంతేకాకుండా కోవిన్ పోర్టల్ లో అతడి పేరు నంబర్ పై వ్యాక్సిన్ వేసుకున్నట్టు ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేయబడింది. 


Aslo Read: Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు తయారీ చేస్తున్న వ్యక్తి..నెట్టింట వీడియో వైరల్..


టీకాలు వేయకుండానే వేసినట్టు ఎలా నమోదు చేస్తున్నారని కొంత మంది ఆగ్రహానికి లోనవుతున్నారు.  అధికారులు 100 శాతం వ్యాక్సిన్ జారీ చేయాలన్న తొందరలో ఇలా మరణించిన వ్యక్తికీ టీకా జారీ చేసినట్టు ధృవీకరించటం చర్చనీయాంశంగా మారింది.


దీనిపై మండల అధికారి మోహనకృష్ణను రిపోర్ట్ చేయగా.. టీకాలు జారీ చేసే వెబ్ సైట్ ప్రస్తుతం పని చేయట్లేదని వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి