Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు తయారీ చేస్తున్న వ్యక్తి..నెట్టింట వీడియో వైరల్..

మీలో చాలా మంది రోడ్డు పక్కన ఉన్న దాబాలోనూ, హోటళ్లలోనూ తందూరీ రోటీ తినే ఉంటారు. కానీ ఎలా తయారు చేస్తున్నారో చూడరు. యూపీలోని ఓ దాబాలో తందూరీ రోటీ ఓ వ్యక్తి ఎలా తయారు చేస్తున్నాడంటే...

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 04:15 PM IST
Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు తయారీ చేస్తున్న వ్యక్తి..నెట్టింట వీడియో వైరల్..

Viral Video: దేశవ్యాప్తంగా ఈ మధ్య పుడ్(Food)కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మనలో చాలా మంది బయట ఆహారం తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే అందులో ఎలాంటి పదార్ధాలు వాడతారోనని భయం. కొవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ భయం మరింత పెరిగింది. పైగా అప్పుడప్పుడు కొందరు నికృష్టపు పనులు చేస్తూ ఉంటారు. గతంలో పానీపూరీ బండి వ్యక్తి ఎలాంటి నీచమైన పని చేశాడో మనందరం చూశాం కదా. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో చోటు చేసుకుంది. 

ఘజియాబాద్‌(Ghaziabad)లో రోడ్డు పక్కన ఉన్న దాబా(Dhaba)లో ఓ వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీ తయారు చేసేటప్పుడు సాధారణంగా నూనె, నీరు వాడతారు. కానీ ఇతగాడు మాత్రం వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత రోటీ(Tandoori Rotis) చేసి.. వాటిని కాలుస్తాడు. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం దాబాకు వచ్చిన ఓ వ్యక్తి.. సదరు వ్యక్తి చేస్తున్న దారుణాన్ని వీడియో తీసి.. సోషల్‌ మీడియా(Social Media)లో షేర్‌ చేశాడు. దాంతో ఇది కాస్త  వైరల్‌గా మారడమే కాక సదరు ధాబా మీద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌(Arrest) చేశారు. 

Also Read: One Euro Houses: అక్కడ రూ.90 లకే సొంతిల్లు..కండిషన్స్ అప్లై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

More Stories

Trending News