Vari Deeksha: ముగిసిన కాంగ్రెస్ వరి దీక్ష- సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగిన నేతలు!
Vari Deeksha: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు దీక్ష ముగిసింది. రెండు రోజుల అనంతరం దీక్షను విమరించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Revanth Reddy fire on CM KCR at Vari Deeksha: తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరి దీక్ష ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగన ఈ దీక్షలో కూర్చున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డీ, కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ కోమట్ రెడ్డి వెంకటర్ రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు (Vari Deeksha) కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కొదండరాం.
ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో విందు చేసుకున్నారు...
ప్రభుత్వం వద్దంటే వరి పంట వేశారనే కక్ష్యతోనే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ధి లేదని విమర్శించారు. ఈ కారణవల్లే టన్నుల కొద్ది ధాన్యం నీటిపాలైందని పేర్కొన్నారు.
ఈ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ధర్నాలు చేశారని ఆరోపించిన (Revanth Reddy fire on CM KCR) రేవంత్ రెడ్డి. ఈ విషయంపై చర్చించేందుకు. ఈ విషయంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన నేతలు ఏదో చేస్తారని.. తెలంగాణలో ప్రతి గింజ కొంటారని భావించినట్లు చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా.. వారంతా ఢిల్లీలో విందు చేసుకుని వచ్చారని ఆరోపించారు.
అందరం కలిసే పని చేస్తాం..
గతంలో ఎప్పుడూ రైతులు పంట కోనుగోలుకోసం ధర్నాల చేయాల్సిన పరిస్థితి రాలేదన్నారు ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్‌రెడ్డి. వరేస్తే.. ఊరేసుకున్నట్లేనని కేసీఆర్ అన్నట్లు గుర్తు చేశారు. రైతులతో పెట్టుకున్న ఎవరు కూడా బాగు పడలేదని (MP Komat Reddy Venkat Reddy on CM KCR) చెప్పుకొచ్చారు. తమలో తమకు చిన్న చిన్న మనస్పర్దలు వచ్చినా కలిసే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే జంతర్ మంతర్ వద్ద వెయ్యి మందితో దీక్ష చేస్తామన్నారు.
ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదు..
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాంలో సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వాల విఫలమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయే గానీ.. సమస్యల గురించి ఆలోచించడం లేదని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటూ.. ప్రభుత్వాలను హెచ్చరించడం తమవంతని స్పష్టం చేశారు.
రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం అబద్దాలు..
దాదాపు 14 నెలలు ఉద్యమం చేసి రైతులు మోదీ మెడలు వంచారనియయ నూతన సాగు చట్టాల ఉపసంహరణను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో సీఎం కేసీఆర్ కనీసం వాళ్లకు మద్దతు కూడా ఇవ్వలేదని విమర్శిచారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లో నల్ల చట్టాలకు వ్యతిరంకంగా తీర్మనాలు చేస్తే.. మన ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఢిల్లీలో 10 రోజులు ఉండి పార్టీ ఆఫీసు తెరిచారు కాని.. అక్కడే ఉన్న రైతులకు కనీసం మద్దతు ప్రకటించలేదని విమర్శించారు. తెలంగాణాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అసలు అలాంటిదేమి జరగలేదన ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వమే రైతుకు పట్టిన పెద్ద చీడ..
చేనుకు చీడపీడ పడితే ఏం చేయాలో రైతులకు తెలుసని.. తెలియకుంటే శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుంటారని వరి దీక్షకు మద్దతు ప్రకటించిన తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కొదండరాం పేర్కొన్నారు. కానీ ప్రభుత్వమే చీడ పీడగా రైతు మీద దాడి చేస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందని చెప్పారు.
వ్యవసాయం దండుగ కాదు పండుగా అనే పరస్థితికి తెస్తానన్న కేసీఆర్ ఇవళ కనీసం వ్యవసాయం నిలబడలేని పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు కోదండరాం. తెలంగాణలో ఏ రైతు దగ్గరకు వెళ్లినా.. ఈ వ్యవస్థ ఇలానే ఉంటే వ్యవసాయం నడవడం కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నలుగుకి అన్నం పెట్టే మమ్మల్ని ఇలా చూస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also read: Eatala Rajender: ఆ అక్కసుతోనే కేసీఆర్ రైతులను వేధిస్తున్నాడు...
Also read: Revanth Reddy: కల్లాల్లో రైతుల చావులకు కేసీఆరే కారణం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి