Eatala Rajender: ఆ అక్కసుతోనే కేసీఆర్ రైతులను వేధిస్తున్నాడు...

Eatela Rajender: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంలో వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 02:13 PM IST
  • సీఎం కేసీఆర్‌పై మరోసారి ధ్వజమెత్తిన ఈటల రాజేందర్
    ధనిక రాష్ట్రంలో వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదు
    ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను వేధిస్తున్నారని ఆగ్రహం
Eatala Rajender: ఆ అక్కసుతోనే కేసీఆర్ రైతులను వేధిస్తున్నాడు...

Eatela Rajender: తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్ (CM KCR)... మరి రైతులు (Telangana Farmers) పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయట్లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హుజురాబాద్ (Huzurabad) ఉపఎన్నికలో ఓటమితో కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించారనే అక్కసుతోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను వేధింపులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఈటల రాజేందర్ ఆదివారం (నవంబర్ 28) మీడియాతో మాట్లాడారు.

చౌటుప్పల్‌లో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ (Eatala Rajender) అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ (CM KCR) అహంకారం, ఆధిపత్యం, రాచరిక పోకడలు తెలంగాణ గడ్డ మీద చెల్లవని హుజురాబాద్ ఉపఎన్నికతో రుజువైందన్నారు. రైతులు పండించిన పంటను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

రైతులు (Telangana Farmers) పండించిన పంటపై మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతోందని ఈటల పేర్కొన్నారు. ఏడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యాన్ని కేంద్ర సర్కార్ కొనుగోలు చేస్తోందన్నారు. అవసరానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం ముందే చెప్పినా... ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కేసీఆర్ (CM KCR) అసమర్థ సీఎం అని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయని... సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇకనైనా కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి వెంటనే ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Also Read: PM Narendramodi : ప్రధానికి ప్రత్యేక రాగంతో పేరు పెట్టిన గ్రామస్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News