Vegetables Price hike: కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మరోసారి కామన్ మ్యాన్ కు ఝలక్ తగిలింది. దేశీయ మార్కెట్ లో టమాటాల ధరల మండిపోతుంటే.. తాజాగా చింతపండు ధర కూడా ఆకాశాన్నింటింది. కిలో చింతపండు రేటు (Tamarind Price hike) చికెన్ ధరను దాటిపోయింది. నెల రోజుల కిందట కేజీ చింతపండు 80 నుంచి 200 రూపాయల మధ్య ఉండేది. ఇప్పుడు అదే చింతపండు రూ.300 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా (Tomato Price hike) రూ.100 నుంచి 200 మధ్య ఉంటే.. పచ్చి మిర్చి కిలో రూ.120 నుంచి రూ. 200 మధ్య ఉంది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో అల్లం ధర రూ.400, వెల్లుల్లి రూ.450 పలుకుతోంది. బియ్యంతోపాటు మసాలా దినుసుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన రేట్లు ప్రజల పాలిట శాపంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 


మన తెలుగు రాష్ట్రాల్లో ఏ కూర వండాలన్నా టమాటా, చింతపండు, అల్లం ఉండాల్సిందే. అలాంటివి వీటి ధరలే పెరిగితే మేమెలా బతకాలని సాధారణ ప్రజానీకం వాపోతున్నారు. దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం, రవాణాకు ఆటంకం ఏర్పడటం తదితర కారణాలు వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతోపాటు ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల కొంత మంది రైతులను కోటీశ్వరులను కూడా చేసింది. ముఖ్యంగా టమాటాలను పండించేవారు బాగా లాభపడ్డారు. 


Also Read: Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం.. 8 మంది జలసమాధి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook