Vemulawada Temple Kodelu Issue: కోడెల పంపిణీపై జీ తెలుగు న్యూస్ కథనాల ఎఫెక్ట్.. విచారణకు ఆదేశం..
Vemulawada Temple Kodelu Issue: మూడవ విడుత కోడెల పంపిణీపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబందిత అధికారులపై ప్రత్యేకమైన నివేదిక సమర్పించాలని కోరారు. అలాగే అధికారులపై ప్రశ్నల వర్షం కుర్పించారు.
Vemulawada Temple Kodelu Issue: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం సంబంధించిన గోశాల కోడెల మాయంపై జీ తెలుగు న్యూస్ కథనాలు ప్రసారం చేయగా, అధికారుల్లో చలనం మొదలైందని చెప్పవచ్చు. దేవాలయానికి సంబంధించిన గోశాలలో ప్రతి కోడె ఆవు వివరాలు ప్రతి రోజు రిపోర్ట్ చేయాలని, కలెక్టర్ అనుమతి లేకుండా మూడవ దశ కోడెల పంపిణీ ఎలా జరిగిందని, దీనికి సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయానికి సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధికారులతో ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన గోశాల నుంచి 60కు పైగా కోడెలు అక్రమ రవాణాపై జీ తెలుగు న్యూస్ కథనాలు ప్రసారం చేయగా జిల్లా కలెక్టర్ స్పందించారు. మూడో విడతకు సంబంధించిన కోడెల పంపిణీ కలెక్టర్ ఆదేశాలు లేకుండా ఎలా పంపిణీ చేశారని అధికారులు ప్రశ్నించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన 1975 పశువుల ప్రస్తుత స్థితి గతులపై కూడా కలెక్టర్ శుక్రవారం నివేదిక అందించాలని కోరారు. అలాగే కోడెలు, ఆవుల పంపిణీ చేసే లబ్దిదారుల జాబితా పై కలెక్టర్ సంతకం లేనంత వరకు జాబితా ఫైనల్ కాదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఇటీవలే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాల పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన పలు రకాల చర్యలపై రివ్యూ జిల్లా కలెక్టర్ నిర్వహించారు. అలాగే దేవాలయానికి సంబంధించిన గోశాల కోడెల పంపిణీ కార్యమం చేపడితే తప్పకుండా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పంపిణీ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు స్పష్టం చేశారు.
జిల్లా అధికారులతో పాటు ఇతర సిబ్బంధితో జిల్లా కలెక్టర్ తన చాంబర్‌లో గోశాలపై ప్రత్యేకమైన రివ్యూ నిర్వహించారు. ఇక నుంచి కోడెలను తరలింపు, రైతులకు పంపిణీ పూర్తి వివరాలు అనుమతి తీసుకుని చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు తెలిపారు. కోడెలకు సంబంధించిన వివరాలపై కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు గోశాల నుంచి 1975 పశువులను తరలించినట్లు తెలిపారు. అలాగే ఇందులో మొదటి దశలో 1278 కోడెలను రైతులను పంచినట్లు అధికారులు వివరించారు. దీంతో పాటు రెండవ విడతలో 389 కోడెలు, మూడవ విడతలో 188 కొడెలు పంపిణీ చేసినట్లు అధికారులు కలెక్టర్‌కి వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.