Kode Mukku: తెలంగాణ ఇలవేల్పు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కోడెలు విక్రయించుకున్నారనే వివాదం రాజుకోగా.. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డి పర్యటనలో భోజనాల ఖర్చు తీవ్ర దుమారం రేపింది. తాజాగా రాజన్న ఆలయంలో భక్తులను ఆలయ సిబ్బంది నిలువు దోపిడీ చేస్తోంది. కోడెమొక్కుల పేరిట భక్తుల నుంచి యథేచ్చగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో ఆలయ ఖజానాకు గండి పడుతోంది. ఆలయ సిబ్బంది తీరుతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: HCA: క్రికెట్‌కు తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌గా తయారుచేస్తాం: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం


దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిత్యం ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. అయినప్పటికీ ఆలయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు స్వామివారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు. రాజన్న ఆలయ సిబ్బంది భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలు స్వామి వారి ఖజానాకి చేరకుండా ఆలయ అధికారులు తమ జేబులోకి తోసేసుకుంటున్నారు.

Also Read: HYDRA Demolish: మరో బాంబు పేల్చిన హైడ్రా.. '2025లోనూ బుల్డోజర్‌తో కూల్చివేతలు ఆగవు'


ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ కోడె మొక్కు చెల్లించుకునే భక్తుల నుంచి డబ్బులు దండుకుంటున్న వీడియో జీ తెలుగు న్యూస్ కెమెరాకు చిక్కింది. కోడె మొక్కు చెల్లించుకునే భక్తుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల దేవుడిగా భావించే రాజన్న ఆలయంలో భక్తుల వద్ద ఈ డబ్బుల వసూళ్లు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఈఓ నిర్లక్ష్యం వల్లే ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేరాప్‌గా మారిన రాజన్న ఆలయంలో ఈఓ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఆలయ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

కాగా తరచూ వివాదాలు చోటుచేసుకుంటుండడంతో ఎంతో ప్రశస్తి కలిగిన వేములవాడ ఆలయ ప్రతిష్ట దిగజారుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రాజన్నకు అపప్రద వస్తోందని.. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా ఆలయ వివాదంలో భాగమవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మంత్రి వివాదంలో చిక్కుకపోవడంతో ఇంకా ఆలయాన్ని ఆ రాజన్నే కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.