HCA: క్రికెట్‌కు తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌గా తయారుచేస్తాం: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం

Hyderabad Cricket Association: మహిళా యువ క్రికెటర్లు త్రిష‌, ధ్రుతిని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అభినందించింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌లో బాలికలు రాణించాలని హెచ్‌సీఏ పిలుపునిచ్చింది. తెలంగాణ క్రికెట‌ర్ల సంఖ్య పెంచుతామని ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 29, 2024, 01:35 PM IST
HCA: క్రికెట్‌కు తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌గా తయారుచేస్తాం: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం

Uppal Stadium: తెలంగాణను క్రికెట్‌ అడ్డాగా మారుస్తామని.. భావి క్రికెటర్లను తీర్చిదిద్దుతామని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ప్రకటించింది. ఐసీసీ మ‌హిళ‌ల‌ అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపికైన తెలంగాణ క్రికెట‌ర్లు జి.త్రిష‌, కె.ధ్రుతిని భారతీయ జట్టులో ఎంపికయ్యేలా చేస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అరిశ్నపల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు ప్రకటించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని బాలికలు క్రికెట్‌లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రపంచకప్ తర్వాత భారీగా కానుకలు ఇస్తామని ప్రకటించారు.

Also Read: HYDRA Demolish: మరో బాంబు పేల్చిన హైడ్రా.. '2025లోనూ బుల్డోజర్‌తో కూల్చివేతలు ఆగవు'

ఐసీసీ మ‌హిళ‌ల‌ అండ‌ర్‌-19 టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు జి.త్రిష‌, కె.ధ్రుతి ఎంపికైన విషయం తెలిసిందే. భారతదేశం తరఫున ఆడుతున్న యువ క్రికెటర్లను హైద‌రాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆదివారం ఘ‌నంగా స‌న్మానించింది. హైదరాబాద్‌లోని ఉప్ప‌ల్ రాజీవ్‌గాంధీ ప్టేడియం ఆవరణలో యువ క్రికెటర్లను హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌పల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు సన్మానించి వారిని అభినందించారు.

Also Read: K Kavitha: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ రెడ్డికి కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం.. లేకుంటే అడ్డుకుంటాం

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ ప్ర‌తిష్ఠాత్మ‌క వ‌ర‌ల్డ్‌క‌ప్ వంటి మెగా టోర్నమెంట్‌కు ఇద్ద‌రు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక‌వ‌డం గ‌ర్వంగా ఉంద‌ని చెప్పారు. ప్రపంచ కప్‌కు చేరుకోవ‌డానికి వారి త‌ల్లిదండ్రులు, కోచ్‌లు ప‌డిన శ్ర‌మ మాటల్లో చెప్ప‌లేనిద‌ని తెలిపారు. వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని సూచించారు. జాతీయ జ‌ట్టులో, డ‌బ్ల్యూపీఎల్ (మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌)లో మ‌రింత మంది తెలంగాణ క్రికెట‌ర్లు ప్రాతినిథ్యం వ‌హించేలా తాము కృషి చేస్తామని ప్రకటించారు. ప్రపంచ కప్‌లో పాల్గొని ట్రోఫీతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. టోర్నీ అనంతరం త్రిష, ధ్రుతికి న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్, స‌హాయ కార్య‌ద‌ర్శి బ‌స‌వ‌రాజు, కౌన్సిల‌ర్ సునీల్ అగ‌ర్వాల్‌, ఐసీఏ స‌భ్యురాలు వంకా రోమ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News