CM KCR: శోభానాయుడు మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. హోరెత్తుతున్న ట్విట్టర్
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతిపట్ల ( Kuchipudi dancer Shobha Naidu Death News) తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పద్మశ్రీ గ్రహీత శోభానాయుడు బుధవారం తెల్లవారుజామున కన్నుమూయడం (Shobha Naidu Passed Away) తెలిసిందే.
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పద్మశ్రీ గ్రహీత శోభానాయుడు బుధవారం తెల్లవారుజామున కన్నుమూయడం (Shobha Naidu Passed Away) తెలిసిందే. కూచిపూడి నృత్యంలో ఆమె అసాధారణ కళాకారిణి అని కొనియాడారు. సత్యభామ, పద్మావతి పాత్రలలో నటించడంతో పాటు డ్యాన్స్ రూపంలో అలరించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
వెంపటి చిన సత్యం శిష్యురాలు అయిన శోభానాయుడు కూచిపూడిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తుంపు తెచ్చుకున్నారు. ఆమె మృతిపట్ల రాజకీయ, సినీ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె భర్త, రిటైర్డ్ ఐఏఎస్ అర్జునరావుకు సానుభూతి తెలుపుతున్నారు. పలు రంగాల ప్రముఖులు ఆయనను ఫోన్‌లో సంప్రదించి పరామర్శిస్తున్నారు.
ప్రముఖ నాట్యకారిణి శోభానాయుడు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శోభానాయుడు మృతిపట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెతో తనకున్న అనుబంధం షేర్ చేసుకున్నారు. వ్యక్తిగతంగా తనకు శోభానాయుడు తెలుసునని, శుభలేఖ సినిమాలో తన క్లాసికల్ డ్యా్న్స్ ప్రదర్శనను ఆమె మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో తన కూచిపూడి నృత్యంతో అవగాహనా కల్పించారని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి.. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఏపీ గవర్నర్ సంతాపం ట్వీట్
గోపీ మోహన్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe