చిరంజీవి రాజకీయాల గురించి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు
హైదరాబాద్: రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం గురించి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తనను రాష్ట్రపతిగా చూడాలి అని చిరంజీవి కోరుకున్నట్టుగానే తన శ్రేయోభిలాషులు చాలా మంది కోరుకుంటున్నారని చెబుతూ.. రాష్ట్రపతి కావాలనే కోరిక మాత్రం తనకేం లేదని అన్నారు.
హైదరాబాద్: రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం గురించి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని చెబుతూ.. నేతలు మాట్లాడుతున్న భాషపై ఆయన తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుతం నేతలు చేస్తున్న రాజకీయాలు తీరు తనకు ఏ మాత్రం నచ్చడం లేదని చెప్పే క్రమంలో.. చిరంజీవి రాజకీయాలు వదిలేసి ఒక విధంగా మంచి పనే చేశారని అన్నారు.
హైదరాబాద్‌లో బుధవారం జరిగిన యోధ డయోగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముహమ్మద్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తనను రాష్ట్రపతిగా చూడాలి అని చిరంజీవి కోరుకున్నట్టుగానే తన శ్రేయోభిలాషులు చాలా మంది కోరుకుంటున్నారని చెబుతూ.. రాష్ట్రపతి కావాలనే కోరిక మాత్రం తనకేం లేదని అన్నారు. కరోనావైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, కరోనా నివారణ కోసం ముందస్తు జాగ్రత్తగా ప్రతీ ఒక్కరు కోవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని ప్రజానికానికి సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ కోసమో లేక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమో అని కాకుండా... మన కోసం మనం ఎవరికి వారుగా రూల్స్ పాటించాలని గుర్తుచేశారు.
Also read : కేసీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదు : బండి సంజయ్
ఉప రాష్ట్రపతిగా కొనసాగుతుండడం వల్ల ప్రజలకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోందని.., అలా ఉండాల్సి రావడం తనకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదని ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. ఉప రాష్ట్రపతి పదవి వల్ల గతంతో పోలిస్తే.. ఇప్పుడు కొంచెం తొందరగా పడుకుంటున్నానని తనదైన స్టైల్లో చమత్కరించారు.
Also read : బండి సంజయ్ రెండు చెంపలు పగలగొట్టాలి : మంత్రి కేటీఆర్
Also read : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook