Telangana Minister KTR sensational comments on BJP Telangana President Bandi Sanjay: యాసంగిలో వరి ధాన్యం కొనే విషయంలో కేంద్రం పూర్తి పంట కొంటామని రాసి ఇవ్వాలని.. లేకుంటే బండి సంజయ్ రెండు చెంపలు పగలకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బుధవారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో 4,743 కొనుగోలు కేంద్రాల ధాన్యం సేకరిస్తున్నామన్నారు. తెలంగాణలో (Telangana) వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. యాసంగిలో ధాన్యం కొనబోమన్న నిర్ణయంపై కేంద్రం (central government) మరోసారి ఆలోచించాలని కోరారు.
Also Read : మోహన్ బాబు ఇంట విషాదం.. రంగస్వామి నాయుడు మృతి
ఇక గురువారం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరఫున ఇందిరా పార్క్ (Indira Park) వద్ద ధర్నాకు కూర్చోబోతున్నట్లు చెప్పారు. ధర్నాలో కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ (BJP) అసత్య ప్రచారాన్ని నమ్మి వరి సాగు చేస్తే రైతులు నష్టపోతారన్నారని కేటీఆర్ వివరించారు. సీఎం కేసీఆర్ (KCR) ఆలోచనలను నమ్మాలని సూచించారు.
Also Read : కేటీఆర్ పోస్ట్‌పై సమంత రియాక్ట్, సోషల్ మీడియాలో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook