CM KCR writes to PM Modi, seeks clarity on paddy procurement: రబీ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలు అవలంభిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తాయని తెలిసినా కూడా ఎఫ్‌సీఐ (Food Corporation of India) (FCI) ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి స్వయంగా వివరించినా స్పందన లేదని సీఎం కేసీఆర్ (CM KCR) లేఖలో వివరించారు. ఎఫ్‌సీఐకి త్వరితగతిన ఆదేశాలివ్వాలంటూ ప్రధానిని కోరారు.
వచ్చే రబీలో తెలంగాణ (Telangana) నుంచి ఎంత ధాన్యం కొంటారో తెలపాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందన్నారు. 2020-21 రబీలో మిగిలిన 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అని సీఎం (CM) పేర్కొన్నారు. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగంలో ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు.
Also Read : వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అనుమానితుడు అరెస్టు
ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. అలాగే ఏడాదికి ఎకరానికి పది వేల రూపాయల పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అందిస్తోందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ (Telangana) రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు అని మోదీని (Modi) ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు.
Also Read : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. మెరుగైన ర్యాంకుల్లో వార్నర్, జంపా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook