Venu swamy helps sritej family: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ మూవీ చూసేందుకు తన కుటుంబంతో వచ్చిన రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. డిసెంబరు 4న జరిగిన ఈ ఘటనపై పోలీసులు మొత్తంగా 18మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు మెయిన్ గా పోలీసులు నిరాకరించిన కూడా అల్లు అర్జున్ రావడమేనంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. అయితే.. ఆస్పత్రిలో బాలుడు శ్రీతేజ్ ను సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎందుకు పరామర్శించలేదని ఏకీపారేశారు. అల్లు అర్జున్ కు  కాళ్లు విరిగాయా.. చేతులు విరిగాయా.. యుద్దం ఏమైన చేశాడా.. వరుస పెట్టి వెళ్లి ఇండస్ట్రీ వాళ్లు కలిశారని మండిపడినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శ్రీతేజ్ కు సినిమా పెద్దలు పరామర్శిస్తున్నారు.


 



ఇప్పటికే జగపతి బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, జానీ మాస్టర్ , వేణు స్వామి కూడా పరామర్శించినట్లు తెలుస్తొంది. అదే విధంగా వేణుస్వామి బాలుడు శ్రీతేజ్ కోలుకొవడానికి తన సొంత ఖర్చులతోమృత్యుంజయ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాను కూడా.. సెలబ్రీటీలకు జాతకం చెబుతూ.. టాలీవుడ్ లో ఒక భాగమైనందు వల్ల.. తన తరుపు నుంచి రేవతి కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.


Read more: Allu Arjun: పుష్ప టీమ్ సంచలన నిర్ణయం.. శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల సాయం..


అదే విధంగా అల్లు అర్జున్ జాతకంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని.. ఆతర్వాత అంత సెట్ అవుతుందని అన్నారు. గతంలో తాను చెప్పిన మాటకలు కట్టుబడి ఉన్నానని.. అల్లు అర్జున్ జాతకం మాత్రం మార్చితర్వాత బ్రహ్మండగా ఉంటుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.