Sandhya Theatre stampede: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో డిసెంబరు 4న తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిలో రేవతి అనే మహిళ చనిపోగా... ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే.. పుష్ప2 టీమ్ నుంచి బాధిత కుటుంబానికి రెండు కోట్ల పరిహారంను ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించినట్లు తెలుస్తొంది.
దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్ ఎలమంచిలి రవి.. మొదలైన వారు.. బాలుడు శ్రీతేజ్ తండ్రిని మరోసారి పరామర్శించినట్లు తెలుస్తొంది. రేవతి కుటుంబానికి అతడి కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.