Telangana Rain Alert:  తెలంగాణలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. గత రెండు. మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నాం ఎండ దంచికొడుతుండగా.. సాయంత్రానికి మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తోంది. గంటల్లోనే ఐదు నుంచి 10 సెంటిమీటర్ల వర్షం కురుస్తోంది. బుధవారం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ లోనూ వర్షం దంచి కొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో 111 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 107, కొమరం బీం జిల్లా కెరమెరిలో 106, ఖమ్మం జిల్లా ఖానాపూర్ లో 104, ఖమ్మంలో 102, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 93 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సాయంత్రం తర్వాత భారీ వర్షం కురిసింది. హయత్ నగర్ లో 54, లింగంపల్లి ఖాజాగూడలో 42, మైలార్ దేవ్ పల్లిలో 32, సరూర్ నగర్ లో 25 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.


తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షం కురుస్తుందని.. మిగితా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. దక్షిణ తెలంగాణపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. జనాలంతా అప్రమత్తంగా ఉండాలని.. సాయంత్రం వేళలో రోడ్ల మీదకు రావొద్దని హెచ్చరించింది. 


Read also: God father Trailer: ‘'గాడ్‌ ఫాదర్'’ ట్రైలర్‌ వచ్చేసింది.. పవర్ ఫుల్ డైలాగ్స్‌, ఫైట్స్ తో ఇరగదీసిన మెగాస్టార్..  


Read also: New Attorney General: నూతన అటార్నీ జనరల్‌గా ఆర్​.వెంకటరమణి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి