Teacher Suicide: సమాజంలో మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. కొన్ని సంఘటనలు చూస్తే సమాజం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యాచారాలు, కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటం నిత్యం చూస్తూనే ఉన్నాం.


కామాంధులుగా మారుతున్న గురువులు..


చాలా మంది సరైన విద్యా బుద్లులు లేక ఇలా ప్రవర్తిస్తున్నారని చెబుతుంటారు. అయితే ఆ విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తుంటే.. ఇంక సమాజంలో సంబంధాలు ఎలా బాగుంటాయి?


విద్య, నీతి, నియమాలు నేర్పే దేవాలయాల్లాంటి స్కూళ్లు, కాలేజీల్లోనే గురువులు సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తుంటే.. సమాజం ఎటు పోతుందో అనే ఆందోళనలు కలుగుతున్నాయి.


ఇంతకి ఏమైందంటే..


భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలోని సాంఘిక సంక్షేమ కళాశాలో వైస్​ ప్రిన్సిపల్ సాగిస్తున్న రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆ వైస్​ ప్రిన్సిపల్​.. అదే కళాశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలితో ఎఫైర్​ పెట్టుకుని.. ఏకంగా కాలేజీలోనే కామ క్రీడలు మొదలు పెట్టారు.


పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆ ఇద్దరు.. కామంతో కళ్లు మూసుకుపోయి.. సభ్య సమాజం గురించి మరిచిపోయి ప్రవర్తించారు.


ఈ తతంగాన్నంతా మరో ఉపాధ్యాయుడు వీడియో తీసి.. ఇదేమిటని నిలదీయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కాస్త వైరల్​గా మారడంతో సదరు ఉపాధ్యాయురాలు అవమానంతో ఆత్మహత్య చేసుకుంది.


అమె ఆత్మహత్యతో వైస్​ ప్రిన్సిపాల్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన వైస్​ ప్రిన్సిపాల్​ను పట్టుకునే పనిలో పడ్డారు.


Also read: 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు


Also read: Omicron: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు...8కి చేరిన కేసుల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook