Vijayashanthi: తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనపై ఊహించని సంగతులు తెలుస్తున్నాయి. మరోసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి వస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. రేవంత్‌ రెడ్డితో భేటీ వెనుక అదే అసలు వ్యూహం ఉందని పార్టీ సీనియర్‌ నాయకుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. రహాస్య అజెండాతో తెలంగాణలోకి చంద్రబాబు ప్రవేశిస్తున్నారని ఇరు నాయకులు చెప్పడం కలకలం రేపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jagga Reddy: రేవంత్‌ పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయ కుట్ర: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు


ఇటీవల హైదరాబాద్‌లో రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు సమావేశంపై తాజాగా విజయశాంతి 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాదు టీడీపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు తెలంగాణలో పర్యటించారని పేర్కొన్నారు. ఆయన పర్యటన చాలా అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో చంద్రబాబు కుట్రలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

Also Read: TS DSC Schedule: తెలంగాణ నిరుద్యోగులకు భారీ షాక్‌.. షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు


 


'ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం విస్తరిస్తుందని ఆయన చేసిన ప్రకటనే ఉదాహరణ. తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ బలపడదు. కానీ టీడీపీ తన కూటమి భాగస్వామి బీజేపీతో కలిసి బలపడడానికి కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తే ఆ రెండూ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడతాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలడం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు టీడీపీని తిరిగి బలపరుస్తామని చెప్పాల్సిన అవసరం ఏముంది?' అని విజయశాంతి సందేహాలు వ్యక్తం చేశారు.


టీడీపీ కూటమి పార్టీ అయిన బీజేపీకి కూడా తెలంగాణల కాంగ్రెస్ పరిపాలన  మంచిగున్నదని బీజేపీ నాయకులకు చంద్రబాబు సూచించాలని విజయశాంతి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని బీజేపీకి చెప్పడం సమంజసంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను చూస్తుంటే చంద్రబాబు తెలంగాణలో మళ్లీ టీడీపీని పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ కావడం కలకలం రేపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి