రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా అధికారికంగా మీడియాకు వెల్లడించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు అని అన్నారు. విజయశాంతి మంగళవారం ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్ గా వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల సమయానికి పార్టీని మరింత బలోపేతం చేసి ఒక సామాన్య కార్యకర్తలా తన వంతు కృషి చేస్తానని విజయశాంతి రాహుల్ తో అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తాను చేయబోయే, అవలంభించే వ్యూహాల గురించి రాహుల్ తో మాట్లాడారు. ఈ భేటీలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా పాల్గొన్నారు. 


ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని కుంతియా అన్నారు. కేసీఆర్ పాలనలో విసిగి వేసారిపోయిన వారంతా కాంగ్రెస్ మొగ్గుచూపుతున్నారని భేటీ అనంతరం తెలిపారు. అయితే, ఈ భేటీలో విజయశాంతికి ఎన్నికల ప్రచార భాద్యతలు ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.