Vikarabad Collector clarity on mob attack: వికారాబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మెయిన్ గా.. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలోని ప్రజలు.. తమ పొలాలను ఫార్మాకంపెనీలకు ఇచ్చేది లేదంటూ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా.. కలెక్టర్ ప్రతీక్ జైన్ వాహానంపై రాళ్లు, కర్రలతో దాడులు సైతం చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు..కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడికి దిగినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పోలీసులు చేరుకుని గ్రామస్థులను శాంతిప చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరోవైపు విధుల్లో ఉన్న కలెక్టర్ పై దాడిని ఖండిస్తు.. వికారబాద్ కలెక్టేరేట్ ఉద్యోగులు పెన్ డౌన్ చేప్టటారు.  దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొవాలని కూడా కలెక్టర్ కార్యలయం మందు నిరసలకు దిగారు. విధుల్లో ఉన్న అత్యున్నత హోదా ఉన్న అధికారిపై దాడులు చేయడం పట్ల కూడా ఉద్యోగ సంఘాలు ఖండించాయి. దీనిపై కఠినంగా వ్యవహరించాలని కూడా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు.


ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు డిమాండ చేస్తామని కూడా నాయకులు  తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కలెక్టర్ ప్రతీక్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్న అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తొంది. తనపై దాడి జరగలేదని కేవలం తోపులాట జరిగిందని కూడా చెప్పుకొచ్చారు.


Read more: Vikarabad: వికారాబాద్‌లో హైటెన్షన్.. కలెక్టర్‌ను ఉరికించి కొట్టిన గ్రామస్థులు.. షాకింగ్ వీడియో వైరల్..


 కేవలం కొంత మంది అల్లరీ మూకలు హాడావుడి చేశారని,  రైతులు మన వాళ్లని ఇలా దాడులు చేయరంటూ కూడా కలెక్టర్ తోటి ఉద్యోగులతో చెప్పారు. అంతే కాకుండా.. ఎవరు ఆందోళనలు చేయకుండా.. తమ విధుల్లోకి వెళ్లిపోవాలని కూడా కలెక్టర్ కోరినట్లు తెలుస్తొంది.  ఇదిలా ఉండగా.. అంతగా ఉర్కించి, ఉర్కించి కొట్టిన కూడా కలెక్టర్ దాడి జరగలేదని చెప్పడం పట్ల కొంత మంది నెటిజన్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.