తెలంగాణ ఎంసెట్‌ 2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ (TS EAMCET 2020 Counselling Schedule)‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి (అక్టోబర్ 12) నుంచి ప్రారంభం కావాల్సిన టీఎస్ ఎంసెంట్ 2020 కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల (TS EAMCET 2020) ప్రక్రియ వాయిదా పడింది. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ యథాతథంగా కొనసాగనుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొత్త కాలేజీలకు గుర్తింపు ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడం, ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 9 నుంచి TS EAMCET 2020 Counselling ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ కొనసాగతున్నాయి. అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈనెల 18కి వాయిదా వేశారు. అక్టోబర్ 18 నుంచి వెబ్‌ఆప్షన్లు ఇచ్చేకునేలా వెబ్‌సైట్‌లో అధికారులు మార్పులు చేశారు. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ రివైజ్డ్‌ షెడ్యూల్‌ను జారీ చేశారు. అక్టోబర్ 22 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. చివరిరోజు కావడంతో ఈ నెల 24న సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ఈనెల 28వ తేదీ వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్, కాలేజీలో ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 



తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కోర్సుల్లో మొత్తం 1,10,873 సీట్లున్నాయి. కొన్ని కొత్త కాలేజీలకు, కొత్త కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. అయితే కోవిడ్19 నేపథ్యంలో అఫిలియేషన్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగింది. 2020-21 అకడమిక్ సంవత్సరానికిగానూ కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో బీటెక్‌లో కొత్తగా 15,690 సీట్లు పెరగనున్నాయి. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe