TS EAMCET 2020 Toppers: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీరే.. సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

TS EAMCET 2020 Results |  తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలలో ఏపీ విద్యార్థులు సైతం సత్తా చాటారు. టాప్ 10లో అయిదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.

Last Updated : Oct 6, 2020, 06:26 PM IST
TS EAMCET 2020 Toppers: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీరే.. సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలు (TS EAMCET 2020 Results)ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌లు సైతం ఫలితాల (TS EAMCET Results 2020) విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరుకాగా, 89,734 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబిత వెల్లడించారు.

తెలంగాణ నుంచి జేఈఈ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి హార్దిక్‌ రాజ్‌పాల్ తెలంగాణ ఎంసెట్ 2020 పరీక్షలో ఐదవ ర్యాంకు సాధించాడు. సాయితేజ వారణాసి తెలంగాణ ఎంసెట్ టాపర్‌గా నిలిచాడు. తెలంగాణ ఎంసెట్ 2020 ఫలితాలలో ఏపీ విద్యార్థులు సైతం సత్తా చాటారు. టాప్ 5 లో ఇద్దరు ఏపీ విద్యార్థులు నిలవగా, ఓవరాల్‌గా టాప్ 10లో అయిదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. TS EAMCET 2020 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడే

తెలంగాణ ఎంసెట్‌ 2020 టాప్ 10 ర్యాంకర్లు వీరే.. (TS EAMCET 2020 Top 10 Rankers)
1. సాయితేజ వారణాసి  (హైదరాబాద్, తెలంగాణ)
2. కె. యశ్వంత్‌ సాయి   (పశ్చిమ గోదావరి, ఏపీ)
3. టి. మణివెంకట కృష్ణ  (తూర్పు గోదావరి, ఏపీ)
4. చాగరి కౌశల్ కుమార్ రెడ్డి  (హైదరాబాద్, తెలంగాణ)
5. హార్దిక్‌ రాజ్ పాల్ (హైదరాబాద్, తెలంగాణ)

TS EAMCET 2020 Top 10 Rankers
6. నాగెల్లి నితిన్ సాయి  (నల్గొండ, తెలంగాణ)
7. తవ్వ ఈ.డి.ఎన్.వి.ఎస్‌. కృష్ణ కమల్  (కృష్ణా, ఏపీ)
8. అన్నం సాయివర్ధన్  (రంగారెడ్డి, తెలంగాణ)
9. వి. సాయి పవన్ హర్షవర్ధన్  (గుంటూరు, ఏపీ)
10. వారణాసి వచన్ సిద్దార్థ్  (విశాఖపట్నం, ఏపీ)

here is the list of ts eamcet 2020 top 10 rankers

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News