Vijayashanthi: విజయశాంతి ఎక్కడా? ప్రచారంలో కానరాని రాములమ్మ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?
Vijayashanthi Out From Politics Where Is She: అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బిజీబిజీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారా? లేదా రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారా? అని చర్చ జరుగుతోంది.
Where Is Vijayashanthi: సినీ తారగా దశాబ్దాలుగా తెలుగు ప్రజలను అలరించిన హీరోయిన్.. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన ఆమె.. బీఆర్‌ఎస్ పార్టీని ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సమయంలో కనిపించడం లేదు. కేసీఆర్‌ను అధికారం దించడమే లక్ష్యంగా చేసుకున్న ఆమె తన లక్ష్యం నెరవేరడంతో రాజకీయాలకు దూరమయ్యారా? పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమెనే రాములమ్మగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ విజయశాంతి.
Also Read: KCR Meets Teacher: భావోద్వేగానికి లోనయిన మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కీలక నాయకులంగా ప్రచారంలో బిజీబిజీగా ఉండగా.. కాంగ్రెస్‌లో ఉన్న విజయశాంతి మాత్రం దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విజయశాంతి కనిపించకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది.
Also Read: JP Nadda: దేశాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ కుట్ర.. రేవంత్ రెడ్డి పెద్ద దొంగ
కారణాలు ఇవేనా?
ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం కేసీఆర్‌కు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లు.. మరికొన్నాళ్లు బీజేపీలో పని చేశారు. ఆమె కొన్ని నెలల కిందట మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌పై విజయశాంతి ప్రత్యక్ష పోరాటానికి దిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విజయశాంతి ఒకవిధంగా యుద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన విజయశాంతి విస్తృత ప్రచారం చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపడంలో ఆమె పాత్ర కూడా ఉంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం విజయశాంతి కనుమరుగైపోయారు. ఆమె ఇప్పుడు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అనూహ్యంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లోకి దూరమవడం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని అగౌరవపర్చిందని.. ఆమెకు పదవులు ఇవ్వలేదని చర్చ జరుగుతోంది. దీనికితోడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా ఆమె దూరమైనట్లు మరో ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా విజయశాంతి మాత్రం చురుగ్గా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter