Telangana MLAs In Telugu: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఏ టర్న్ తీసుకుంటుందో ఇంట్రెస్టింగ్ గా మారింది. నెల రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే  హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ ఎలా ఉండబోతుంది..దానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర చర్చ జరగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఈ వ్యవహారంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి..స్పీకర్ అసలు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.ఒక వైపు హైకోర్టు ఆదేశించిన సమయంలోనే మరో పక్క స్పీకర్ ప్రసాద్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు..దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా ఉంది.


ఇంతకీ స్పీకర్ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే....ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని  నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం మొదలైంది. స్పీకర్ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది.స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తుంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని మండిపడింది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీకీ పీఏసీ ఛైర్మన్ గా స్పీకర్ ప్రకటించడం ఇంతలా వివాదానికి దారితీసింది. ఐతే స్పీకర్ ఈ నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదని..దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.


పీఏసీ అంశంపై మాట్లాడిన సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం జరిగిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రతిపక్ష నేతలకు పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ అదే సాంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పాటించదని శ్రీధర్ బాబు ప్రకటించారు.  ఇంత వరకు బాగానే ఉన్నా..శ్రీధర్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ కలకలం సృష్టించింది. అంటే అరికపూడి గాంధీ ఏ పార్టీ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నాడా..లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికపూడి గాంధీ ప్రకటించారని అందుకే పీఏసీ ఛైర్మన్ గా  స్పీకర్ ప్రకటించారని  శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కు ఒకింత షాక్ కు గురైంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడింది.


అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావు ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికపూడి గాంధీ ఒకరు. పీఏసీ ఛైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఐతే మరి మిగితా 9 మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్లా..లేక కాంగ్రెస్ వాళ్లా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా..అనే సందేహం అందరిలో మెదులుతుంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్తా రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యను అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కాంగ్రెస్ చేరిన 10 మంది   బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజక అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి, మంత్రులను కలిశారు తప్పా వారు కాంగ్రెస్ లో చేరలేదనే కొత్త వాదన కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చక పార్టీకీ దూరంగా ఉంటున్నారనే కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చింది. ఈ పరిణామం ఒకింత బీఆర్ఎస్ కు షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు. అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని పొలిటికల్ సర్కిల్ టాక్. అందులో భాగంగానే అరికపూడి గాంధీనీ పీఏసీ ఛైర్మన్ గా నియమించడం. ఆయనతో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పించడం అందులో భాగమే అని రాజకీయ వర్గాల్లో గుసగుస వినపడుతుంది. 


అయితే ఇదంతా బాగున్న కాంగ్రెస్ ముందు కూడా ఒక పెద్ద సవాల్ ఉంది. పది మంది ఎమ్మెల్యేలో దానం నాగేందర్ అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. దానం నాగేందర్ ఇష్యూలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. మిగితా తొమ్మది మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితే దానం నాగేందర్ అంశంలో ఒక చిక్కు ముడి ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ తరుపున దానం నాగేందర్ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ కు పెద్ద సమస్యగా వచ్చి పడింది. దీంతో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


అయితే కాంగ్రెస్ కూడా దానం నాగేందర్ విషయంలో ఒక క్లారిటీతోనే ఉందనేది సమాచారం. ఒక వేళ స్పీకర్ దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తే  ఏం చేయాలో ఇప్పటికే ఒక ప్రణాళికతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అవసరమైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సిద్దపడేలా కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగో అధికారంలో ఉన్నాము..కాంగ్రెస్ పై కూడా ప్రజలకు ఒకింత సానుకూల వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చినా గెలుపు కాంగ్రెస్ దే అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచన. ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ లో తన పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుందట. అయితే ఇంత వరకు బాగానే ఉన్న ఇక్కడ కూడా కాంగ్రెస్ కు ఒక నెగటివ్ అంశ కలవరపెడుతుంది. గతంలో కూడా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఓటమి పాలయ్యాడు. ఇదొక్కటి మాత్రం కాంగ్రెస్ కు కొంత ఆందోళన కలిగిస్తుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మొత్తానికి కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలతో బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిది. పీఏసీ ఛైర్మన్. ఎమ్మెల్యేల అనర్హతం అంశం, వాటిపై బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ఎలా ఎదుర్కోనుందో అనేది మాత్రం వేచి చూడాలి.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.