Telangana Rain alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కూడా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో భద్రాది కొత్తగూడెం, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి , వరంగల్, మహబూబా బాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. భద్రాది కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో అత్యధికంగా 116 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా పొంకల్ లో 69, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 66, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 59, వరంగల్ జిల్లా చెన్నారావుపేట 57, మహబూబా బాద్ జిల్లా కురవిలో 57 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరికి మళ్లీ వరద పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 42 అడుగులుగా ఉన్న నీటిమట్టం సోమవారం ఉదయానికి 43 అడుగులు క్రాస్ అయింది. ప్రస్తుతం భద్రచాలం దగ్గర గోదావరి నీటి ప్రవాహం 9 లక్షల 55 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మేడిగడ్డ నుంచి కొంత వరద పెరగడంతో భద్రాచలంలో నీటిమట్టం మరింతగా పెరగనుంది. గోదావరిలో వరద పెరుగుతుండటంతో ముంపు వాసులు మళ్లీ వణికిపోతున్నారు. కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది.


మరోవైపు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 89 వేల 198 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ నుంచి ఔట్ ఫ్లో  25,763 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 544.50 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ  312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. శ్రీశైలానికి వరద క్రమంగా తగ్గుతోంది. ఎగువన సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలానికి ఇన్ ఫ్లోలు తగ్గాయి.  


Read also:


Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవస


Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.