Girl Named Shalini Kidnapped in Rajanna Siricilla District: తెలంగాణలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో వైశాలి కిడ్నాప్ ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలాంటి మరో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఒక యువతిని కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. ఈరోజు తెల్లవారుజామున ఒక కారులో వచ్చిన కొందరు వ్యక్తులు తండ్రితో కలిసి నడుస్తున్న శాలిని అనే యువతిని కిడ్నాప్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె పక్కనే ఉన్న ఆమె తండ్రి ప్రతిఘటించబోగా ఆయనను కింద పడేశారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలిని ఇంటి వద్దకు ఈరోజు తెల్లవారుజామున షిఫ్ట్ కారులో ముఖాలకు మాస్కులు తగిలించుకుని కొందరు వ్యక్తులు వచ్చారు. అప్పుడు గుడికి వెళ్లి ఇంటికి వెళుతూ ఉన్న శాలినిని పట్టుకుని కారులో ఎక్కిస్తూ ఉండగా ఈ వ్యవహారాన్ని గమనించిన ఆమె తండ్రి వారిని అడ్డుకోబోయాడు.


దీంతో వెంటనే ఆ తండ్రిని తోసేసి శాలినిబు బలవంతంగా కారులో ఎక్కించుకుని ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక అదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్ అనే వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏడాది క్రితం జాన్- శాలిని ప్రేమించుకుని బయటకు పారిపోయినట్లుగా చెబుతున్నారు. మైనర్ అయిన తమ కుమార్తెను జాన్ కిడ్నాప్ చేశాడని అప్పట్లో శాలిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అతనిపై ఫోక్సో చట్టం కింద సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇద్దరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి విడిపించడంతో ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శాలినికి మైనారిటీ తీరడంతో వేరే వ్యక్తితో నిశ్చితార్థం కూడా కుటుంబ సభ్యులు చేశారని ఈ క్రమంలో యువతిని కిడ్నాప్ చేయడంతో సదరు వ్యక్తిపైనే కుటుంబ సభ్యులు అవమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.


ఇక యువతీని కారులో కిడ్నాప్ చేసి తీసుకు వెళుతుండగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో కొన్ని దృశ్యాలు రికార్డు అయ్యాయి. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. హనుమాన్ దేవాలయంలో పూజ చేసి ఇంటికి వస్తుండగా సదరు యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అనే విషయం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Also Read: Kiccha Sudeep: చెప్పుతో కొడతారా? పునీత్ ఉండి ఉంటే ఆయన సమర్థిస్తారా?


Also Read: Mohan Babu : పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.