హైదరాబాద్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యువతులు, మహిళలు పోస్ట్ చేసిన ఫోటోలను ( Photos morphing ) సేకరించి.. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి తిరిగి వారిపై వేధింపులకు ( Cyber crime) పాల్పడుతున్న మోసగాడిని సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు.. ఒక పథకం ప్రకారం మహమ్మద్ అహ్మద్‌ని అరెస్ట్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఇప్పటికే నిందితుడు పలువురు యువతులను బ్లాక్‌మెయిల్ ( Blackmail ) చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తేలింది. ( Also read: ATM pin: పర్సు, మొబైల్ కొట్టేసి.. ఏటీఎం పిన్ కోసం వెనక్కి తిరిగొచ్చారు.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి )


యువతులు, మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసిన ( Morphed photos ) అనంతరం వారితో స్నేహం నటిస్తూనే ఫోన్ నెంబర్లు సేకరించడం.. ఆ తర్వాత ఆ మార్ఫింగ్ ఫోటోలు పంపించి డబ్బులు గుంజినట్లు సమాచారం. నిందితుడిపై ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అమ్మాయిలతో స్నేహం చేసినట్టు నటించిన మహమ్మద్ అహ్మద్ వలలో పడి చాలా మంది మోసపోయారని పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్‌పై పోలీసులు ఎప్పటికప్పుడు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ... ఇప్పటికీ కొంతమంది సైబర్ క్రైమ్ బారినపడి మోసపోతూనే ఉన్నారు. Sex racket: సెక్స్ రాకెటీర్ సోనూ పంజాబన్‌కి 24 ఏళ్ల జైలు శిక్ష )