YS Sharmila Arrest: ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన షర్మిల అరెస్ట్!
YS Sharmila Arrested By Telangana Police: నిన్న టీఆర్ఎస్ నేతలు దాడిలో ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు షర్మిల వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
YS Sharmila Arrested By Telangana Police at Pragathi Bhavan: తెలంగాణలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర నిన్న అర్ధంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. నర్సంపేట నియోజకవర్గంలో సాగుతున్న వైఎస్సార్ టిపి పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో పాటు షర్మిల బస్సును తగలబెట్టేందుకు ప్రయత్నించిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆమె పాదయాత్రను ముందుకు వెళ్ళనిస్తే టీఆర్ఎస్ శ్రేణులతో ఇబ్బంది అని భావించి పోలీసులు షర్మిల పాదయాత్ర ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వెనక్కు తగ్గకపోవడంతో ఆమెను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఆమెకు ముఖం భాగంలో కూడా కొన్ని గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న టీఆర్ఎస్ నేతలు దాడిలో ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ కు షర్మిల బయలుదేరారు.
నిజానికి ఆమె అలా చేస్తారని ముందే ఊహించిన పోలీసులు పెద్ద ఎత్తున ఆమె ఇంటి బయట మోహరించారు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పోలీసులు కళ్ళు కప్పి బయటకు వచ్చేసిన షర్మిల ప్రగతి భవన్ కి వెళుతూ ఉండగా రాజ్ భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కారు అద్దాలు లాక్ చేసుకుని షర్మిల లోపల ఉండి పోయారు. డోర్ లాక్ చేసిన షర్మిల కారు దిగేందుకు నిరాకరించారు.
కానీ ట్రాఫిక్ పెద్ద ఎత్తున అక్కడ జామ్ అవుతుండడంతో వెంటనే షర్మిల కారును పోలీసులు టోయింగ్ వెహికల్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను కారు డోరు తెరిచి బలవంతంగా కిందకు దించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆమెను పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్ చూపించడానికి తీసుకెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
నిజానికి ఉదయం 11 గంటల సమయంలో పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తానని శాంతియుతంగా నిరసన తెలియజేస్తానని పోలీసుల వద్ద అనుమతి కోరారు. అయితే పోలీసులు దానికి అనుమతి ఇవ్వలేదు.
ప్రగతి భవన్ ముట్టడించేందుకు ఆమె వెళ్తున్నారని సమాచారం అందుకోవడంతోనే తాము ఆమెను అరెస్ట్ చేస్తే అదుపులో తీసుకునేందుకు ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక షర్మిల స్వయంగా కారు నడుపుకుంటూ ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను ఒక పార్టీ అధ్యక్షురాలిని అని తనని అడ్డగించడం, ఇలా అదుపులోకి తీసుకోవడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.
Also Read: Chicken Marriage: చికెన్ పెట్టలేదని ఆగిన పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook