Ys Sharmila On Revanth Reddy: తెలంగాణలో రైతులు బిక్కుబిక్కుమంటూ జీవన సాగిస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మార్కెట్ యార్డులలో అన్నదాతలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. వారాల తరబడి రైతులు యార్డుల్లో వరి కుప్పలు పోసుకుని రైతులు కష్టాలు పడుతున్నారని అన్నారు. కనీస సౌకర్యాలు లేక లేకపోవడంతో వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతుందన షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోనూ ఇదే దుస్థితి ఉందన్నారు. సీఎం జిల్లాలోనే కొనుగోళ్లు జరగడం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా దారుణ పరిస్థితులు ఉన్నాయని షర్మిల తెలిపారు.ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దాదాపు ఐదు లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం నీళ్ల పాలైందని షర్మిల ఆరోపించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్దతు ధర ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తీసుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు. రైతుల శ్రమను కేసీఆర్ సర్కార్ దోచుకుంటుందని ఆరోపించారు. వరి విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి రైతులను మోసం చేసిందని విమర్శించారు. వరి వేస్తే ఉరి అంటూ బెదిరించారని అన్నారు. కేసీఆర్ మాటలు విని కొందరు రైతులు వరి సాగు చేయకుండా తమ పొలాలను బీళ్లుగా ఉంచారని చెప్పారు. వాళ్లకు ఇప్పుడు ఎవరూ సాయం చేస్తారని షర్మిల ప్రశ్నించారు. సీఎం మాటలు విని వరి సాగు చేయక కొందరు నష్టపోతే... పంట వేసిన వాళ్లు కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం అని చెప్పుకునే కేసీఆర్.. గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని షర్మిల నిలదీశారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. రైతులకు బోనస్ ఇవ్వలేరా ఇని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటికి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. తమతో పాటు వస్తే అన్నదాతల కష్టాలు చూపిస్తామన్నారు షర్మిల. కేసీఆర్ మత్తు వీడితేనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు.


వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా ఘాటుగా  స్పందించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని వాళ్ల పార్టీ వాళ్లే అంటున్నారని అన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగని పార్టీ చీఫ్ గా పెడితే ప్రజలు నమ్మరని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.వరంగల్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాలన్నారు. అప్పుడే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం కల్గుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పుకునే స్థాయికి కాంగ్రెస్ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలంతా ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని భావిస్తుండటం వల్లే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారన్నారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ రాజకీయాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని షర్మిల అన్నారు. 


READ ALSO: Cyclone Asani Update Today : తీవ్ర తుఫానుగా మారనున్న అసాని !.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు


READ ALSO: Fire Accident: ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు... వెలుగులోకి 'ప్రేమ' కోణం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook