Cyclone Asani Update Today : వాతావరణ కేంద్రం కాస్త ఊరట కలిగించే మాట చెప్పింది. తుఫాన్ అసాని ఒడిశా- ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశం లేదని వెల్లడించింది. అయినా కొన్ని చోట్ల భారీ వర్షాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తీరానికి సమాంతరంగా తుఫాన్ కదులుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ అండమన్ సముద్రంలో ఏర్పాడిన అల్పపీడనం క్రమంగా బలం పుంజుకుని శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాను మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,140 కి.మీ., పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 1,180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తుపాను... గంటకు 75 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అసాని తుపాను ప్రభావంతో మే 10 సాయంత్రం నుంచి ఒడిశా, ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిసింది. మే 11ను ఒడిశా, ఏపీతో పాటు పశ్రిమ బెంగాల్‌లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరిక ఎగురవేశారు.
Also Read: Tsrtc Cuts Driver Salary : మైలేజీ తగ్గిందని డ్రైవర్ జీతంలో కోత.. ఆర్టీసీ వింత పోకడ
Also Read: ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు... వెలుగులోకి 'ప్రేమ' కోణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook