Ys Sharmila Party: తెలంగాణ రాజకీయాల్లో కలకలం కల్గించిన అంశం వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన. రాజన్య రాజ్యమంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్న షర్మిల త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదెప్పుడంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ( YSR ) ముద్దుల తనయ వైఎస్ షర్మిల ( Ys Sharmila ) నిర్వహించిన ఆత్మీయ సమావేశం తెలంగాణ  ( Telangana )రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ , బీజేపీలు విమర్శలు గుప్పించాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణలో రాజన్య రాజ్యం తెస్తానంటూ చెప్పడమే కాకుండా త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. ఇంకా పార్టీ పేరు, ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికే కొత్త పార్టీ విషయమై ఏర్పాట్లు ఊపందుకున్నట్టు సమాచారం. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ( Ys sharmila new political party ) ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంపై రెండు తేదీలు విన్పిస్తున్నాయి. ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అయిన జూలై 8 వతేదీ కాగా..మరొకటి వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మే 14. వైఎస్ షర్మిల జూలై 8వ తేదీవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే జూలై అంటే మరింత ఆలస్యమై..పార్టీ బలోపేతానికి సమస్య రావచ్చని మే 14 వ తేదీ అయితే అన్ని విధాలా బాగుంటుందనేది కొంతమంది సూచన. మే 14న పార్టీ ప్రకటిస్తే..వెనువెంటనే పాదయాత్ర కూడా ప్రారంభించవచ్చనేది ఆలోచనగా ఉంది. రెండింట్లో ఏ తేదీ అనేది త్వరలోనే నిర్ణయించనున్నారు. 


Also read: Union territory: ఆ నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తారా..అసద్ వ్యాఖ్యల్లో నిజమెంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook