Union territory: ఆ నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తారా..అసద్ వ్యాఖ్యల్లో నిజమెంత

Union territory: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. అదే బాటలో దేశంలోని మరి కొన్ని నగరాలు. నిజమేనా. ఇదంతా కేవలం రాజకీయ ఆరోపణలేనా. బీజేపీ ఎందుకు ఖండించలేదు..అసదుద్దీన్ వ్యాఖ్యల వెనుక నిజమెంత

Last Updated : Feb 14, 2021, 02:46 PM IST
  • పార్లమెంట్ సాక్షిగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
  • హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, లక్నో, ముంబాయి, అహ్మదాబాద్ నగరాల్ని యూటీలుగా చేస్తారని వ్యాఖ్యలు
  • కశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని..బీజేపీ మార్క్ పాలన ఇదేనని వ్యాఖ్య
Union territory: ఆ నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తారా..అసద్ వ్యాఖ్యల్లో నిజమెంత

Union territory: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. అదే బాటలో దేశంలోని మరి కొన్ని నగరాలు. నిజమేనా. ఇదంతా కేవలం రాజకీయ ఆరోపణలేనా. బీజేపీ ఎందుకు ఖండించలేదు..అసదుద్దీన్ వ్యాఖ్యల వెనుక నిజమెంత

హైదరాబాద్ ( Hyderabad ) ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సహా చెన్నై, లక్నో, ముంబాయి, అహ్మాదాబాద్, బెంగళూరు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే ప్రమాదముందని..నరేంద్ర మోదీ ప్రభుత్వం ( Narendra modi goverment ) భవిష్యత్‌లో ఇదే నిర్ణయం తీసుకునే అవకాశముందని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను తమ గుప్పిట్లో తీసుకునేందుకు యూటీగా మార్చనున్నారని చెప్పారు. బీజేపీ మార్క్ పాలన ఇదేనని..కశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Home minister amit shah )దీనికి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. లోక్‌సభ ( Loksabha ) సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల్ని బీజేపీ నేతలెవరకూ ఖండించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల్లో నిజం లేకపోతే..బీజేపీ నేతలు ఎందుకు ఖండించలేదనే వాదన విన్పిస్తోంది. 

కశ్మీర్ యూటీ ( Kashmir UT ) గా చేసినప్పుడు చప్పట్లు కొట్టిన పార్టీలు లక్నో, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్ని యూటీలు ( Union territories )గా మార్చినప్పుడు చప్పట్లు కొడతారా అని అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) ప్రశ్నించారు. బీజేపీకు మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందించారు. టీఆర్ఎస్ ( TRS )నేతలేం చేస్తున్నారని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఏదో బహిరంగ సభల్లోనో మీడియా సమావేశంలోనే అసుదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఏకంగా పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కావడంతో ఆసక్తి రేపుతున్నాయి. 

Also read: Ys sharmila party: షర్మిల పార్టీపై మతం ముద్ర వేసే ప్రయత్నాలు షురూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News