YS Sharmila comments On Telangana CM KCR: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) స్థాపించానని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు వ్యతిరేకి కాదని, ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. కానీ వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో పలు అంశాలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధినేత్రి వైఎస్ షర్మిల ప్రస్తావించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అలిగి తాను పార్టీ పెట్టాననడం సరికాదన్నారు. ఏపీలో రాజన్య రాజ్యం వస్తోంది, కానీ తెలంగాణలో రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పారు. సోదరుడు వైఎస్ జగన్, తాను రెండు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే రాష్ట్రంపై, ఇక్కడి ప్రజలపై ప్రేమ లేనట్లేనా.. తామెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమని చెప్పలేదన్నారు. తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Also Read: Telangana Minister KTR: ఈటల రాజేందర్ తన తప్పును ఒప్పుకున్నారు, మంత్రి కేటీఆర్ కామెంట్స్



‘మహిళలు కేవలం పూజలు, వ్రతాలు చేసుకోవాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను మాత్రం తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు వ్రతం చేస్తున్నాను. సీఎంగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. అధికార దుర్వినియోగం చేస్తూ దొరల పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. ఒంటరినని ఏమాత్రం బాధ లేదు, భయం లేదు. తన తండ్రి వైఎస్సార్ తరహాలోనే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నానని’ వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు.


Also Read: Ys Sharmila Deeksha: లోటస్ పాండ్‌లో దీక్ష విరమించిన వైఎస్ షర్మిల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook