YS Sharmila Supports Rahul Gandhi: బీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు మద్దతుగా కలిసొచ్చిన వైఎస్ షర్మిల
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ బందిపోట్లు ప్రాజెక్ట్ అవినీతిపై కొత్త పాట పాడటం విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తంచేసిన వైఎస్ షర్మిల... రూ.80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో లక్ష కోట్లు ఎలా తింటాం అని మంత్రి హరీశ్ రావు సహా బీఆర్ఎస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఖమ్మంలో జరిగిన జన గర్జన సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కారు లక్ష కోట్లు కాజేసిందని చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చే క్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రూ, 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ఆరోపించడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వితండవాదం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది అని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని దోచుకుతిన్న దొంగలు కాగ్ రిపోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.62 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును అంచనా వ్యయం 1,51,168 కోట్లకు పెంచారని, నెలకు రూ.2,100 కోట్లు ఎలా చెల్లిస్తారని కాగ్ తూర్పారపడితే బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ ప్రశ్నించే వారిపై మాత్రం అక్కసు వెళ్లగక్కడం మాత్రమే బీఆర్ఎస్ దొంగలకు తెలుసు అని ఫైర్ అయ్యారు.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి, రూ.1.51 లక్షల కోట్లకు అంచనా వ్యయం పెంచారు అని వైఎస్ షర్మిల వివరించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు కానీ.. ఇదేం అని ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారింది అని ఆవేదన వ్యక్తంచేశారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే మునిగిపోతే కనీసం విచారణ కూడా చేపట్టలేదు. మరి లక్ష కోట్లతో ఎవరి జేబులు నింపినట్టు అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఈ కాళేశ్వకం ప్రాజెక్టు వల్ల ఎవరికి మేలు జరిగినట్టు అని ప్రశ్నించిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చుకు, దాని వల్ల జరుగుతున్న ప్రయోజనాలకు పొంతనే లేదన్నారు. కాళేశ్వరం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువ చేసి చూపించారని చెబుతున్న కాగ్ మాటలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దొరకు వినిపించడం లేదా అని వైఎస్ షర్మిల నిలదీశారు.
తెలంగాణలో.. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంత అవినీతి జరుగుతుందని తెలిసినప్పటికీ.. బీజేపీ ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు అని కేంద్ర ప్రభుత్వం తీరును వైఎస్ షర్మిల తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ సైతం ఆరోపణలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బీజేపీకి బీ టీం కాకపోతే కేంద్ర పెద్దలు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి : Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్
కేసీఆర్ కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అడుగడుగునా అవినీతి, తప్పుడు లెక్కలమయం అయిందని వైఎస్ షర్మిల మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో కేసీఆర్ చేసిన రూ.లక్ష కోట్ల "MEGA" కుంభకోణంపై కేవలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే పోరాటం చేస్తోంది అని గుర్తుచేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిపై ఢిల్లీ వరకు పోరాడి సీబీఐ, కాగ్ వంటి జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేశాం అని తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవినీతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత విచారణ జరిపించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది అని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK