Zee News-Matrize Opinion Poll: తెలంగాణపై జీ న్యూస్-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే..?
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అధికారంలోకి ఎవరు వస్తారు..? అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీ న్యూస్-మ్యాట్రిజ్ నిర్వహించిన ఓపియన్ పోల్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా..
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సర్వేలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్నేయగా.. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ పోరాడుతున్నాయి. తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని ఇప్పటికే సర్వేలు తేల్చాయి. తాజాగా జీ న్యూస్-మ్యాట్రిజ్ నిర్వహించిన ఓపియన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుని అభిప్రాయాలు సేకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయవచ్చు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? తదితర అంశాలపై ఓటర్ల అభిప్రాయం సేకరించింది. ఆదివారం జీ న్యూస్-మ్యాట్రిజ్ తెలంగాణ ఒపీనియన్ పోల్ వివరాలను వెల్లడించింది.
1-ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?
==> చాలా బాగుంది-30%
==> సంతృప్తికరంగా ఉంది-32%
==> అస్సలు బాగోలేదు-24%
==> అభిప్రాయం చెప్పలేం-14%
2-ప్రస్తుత ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది..?
==> చాలా బాగుంది-26%
==> సంతృప్తికరంగా ఉంది-31%
==> అస్సలు బాగోలేదు-26%
==> అభిప్రాయం చెప్పలేం-17%
3-తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులు..?
==> కె.చంద్రశేఖర్ రావు (బీఆర్ఎస్)-36%
==> కేటీఆర్ (బీఆర్ఎస్)-09%
==> కె.కవిత (బీఆర్ఎస్)-05%
==> రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)-18%
==> కిషన్ రెడ్డి (బీజేపీ)-06%
4-కేంద్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?
==> చాలా బాగుంది-23%
==> సంతృప్తికరంగా ఉంది-31%
==> అస్సలు బాగోలేదు-37%
==> అభిప్రాయం చెప్పలేం-09%
5-అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు..? (పార్టీ-ఓట్ల శాతం)
==> బీర్ఎస్-43%
==> కాంగ్రెస్-36%
==> బీజేపీ-13%
==> ఎంఐఎం-04%
==> ఇతరులు-04%
6-అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? (పార్టీ-సీట్లు)
==> బీఆర్ఎస్-70-76
==> కాంగ్రెస్-27-33
==> బీజేపీ-05-08
==> ఎంఐఎం-06-07
==> ఇతరులు-0-1
Also Read: Election Survey 2023: ఆసక్తి రేపుతున్న ఆ సర్వే, తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్‌లో అధికారం ఎవరిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook