Election Survey 2023: ఆసక్తి రేపుతున్న ఆ సర్వే, తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్‌లో అధికారం ఎవరిది

Election Survey 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ తీవ్రమైంది. ఈ నేపధ్యంలో తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదనే విషయంలో మరో సర్వే వెల్లడైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2023, 10:55 AM IST
Election Survey 2023: ఆసక్తి రేపుతున్న ఆ సర్వే, తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్‌లో అధికారం ఎవరిది

Election Survey 2023: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంటే, రాజస్థాన్, మద్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంది. ఈ నేపధ్యంలో ఓ జాతీయ సంస్థ వెలువరించిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. 

పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలపై సర్వే నిర్వహించింది. ఇప్పటికే విడుదలైన వివిధ సంస్థల సర్వే ఫలితాలకు విరుద్ఘంగా ఈ ఫలితాలున్నాయి. తెలంగాణలో అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా..బీఆర్ఎస్ మరోసారి అధికారంలో వస్తుందని తేల్చింది. బీఆర్ఎస్ పార్టీకు 61-66 స్థాలు, కాంగ్రెస్ పార్టీకు 46-51 స్థానాలు, బీజేపీకు 2-5 స్థానాలు, మజ్లిస్ పార్టీకు 5-7 స్థానాలు వస్తాయని పొలిటికల్ క్రిటిక్ సర్వే తెలిపింది. 

ఇక రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ మరోసారి అధికారం చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకు 100-110 స్థానాలు వస్తే బీజేపీ 70-80 స్థానాలకు పరిమితం కానుంది. ఇతరులు 15-20 స్థానాల్లో విజయం సాధించనున్నారు. 

ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోనుంది. కాంగ్రెస్ పార్టీ 125-135 స్థానాల్లో విజయం సాధించనుండగా, బీజేపీ 90-100 స్థానాలు దక్కించుకుంటుంది. ఇతరులు 2-5 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. అంటే మధ్యప్రదేశ్‌లో ఈసారి కాంగ్రెస్ అధికారం చేపట్టనుంది. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారం దక్కించుకున్నా..పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా వర్గం విడిపోవడంతో బీజేపీ అధికారం చేపట్టింది. 

తెలంగాణలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ హోరాహోరీ పోటీ ఉంటుందని దాదాపు అన్ని సంస్థలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకు పట్టం కడుతుంటే మరి కొన్ని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందంటున్నారు. పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారం కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ గట్టిగా ఉన్నా అధికారం మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనంటోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ విషయంలో చాలా సంస్థల సర్వేలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. 

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News