Mp Dharmapuri Arvind: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి నిందితులకు బెయిల్..
Mp Dharmapuri Arvind: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో తొమ్మిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. నిందితుల తరపున న్యాయవాది తిరుపతి వర్మ వాదనలు వినిపించారు. వాటికి ఏకీభవించిన నాంపల్లి కోర్టు 9 మందికి బెయిల్ మంజూరు చేసింది.