'కరోనా వైరస్'.. ఈ పేరు వింటేనే... వెన్నుపూసలో వణుకుపుడుంతోంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా .. 'కరోనా వైరస్' గురించే చర్చించుకుంటున్నారు.  మొత్తంగా 80కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్'.. కారణంగా ఇప్పటికే చైనాలో మృతుల సంఖ్య 3 వేల 928కి చేరుకుంది. వుహాన్, హుబీ ప్రావిన్స్ లో ఇప్పటికీ పరిస్థితి దారుణంగా ఉంది. ఐతే 'కరోనా వైరస్' ముందు ఓ వ్యక్తి తొడగొట్టి నిలబడ్డాడు. ఏయ్.. 'కరోనా' నువ్ నన్ను ఏం చేయలేవ్ అని సవాల్ విసిరాడు. ఆ వ్యక్తి . . 16 ఏళ్ల పడుచు పిల్లాడు కాదు.. అక్షరాలా 100 ఏళ్ల దాటిన పండు ముదుసలి. అదీ ఎక్కడో కాదు..  కరోనా వైరస్ పుట్టిన ఊళ్లోనే.. తాత తొడగొట్టాడు. కరోనా వైరస్ ను పడగొట్టాడు. అవును..  ఆ వృద్ధుడు కరోనా వైరస్ లక్షణాలతో ఫిబ్రవరి 24న వుహాన్ లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. దాదాపు 13 రోజుల పాటు కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని.. నిన్న రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.  ఆయనకు అల్జీమర్స్, రక్తపోటు, గుండె సమస్యలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ యాంటీ వైరల్ మందులు, ప్లాస్మా ట్రాన్ఫ్యూజన్,  చైనా సంప్రదాయ మందులతో వృద్ధుడు కోలుకున్నాడు. 


Read Also: 'కరోనా వైరస్'పై ఫన్నీ వీడియోలు


100 ఏళ్ల దాటిన చైనా వృద్ధుడు కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. అప్పట్లో ఆయన తీసుకున్న ఆహారమే.. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసిందని..  ఆ కారణంగానే ఆయన్ను మృత్యువు కూడా ఏం చేయలేకపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన్ను చైనా మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. Read Also:కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!