కరోనాను జయించిన వందేళ్ల బామ్మ..
కరోనా మహమ్మారి బారిన పడిన 100సంవత్సరాల వయసు గల మహిళ వృద్దురాలు కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న సంఘటన ఇండోనేషియా చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని తన స్వస్థలమైన సురబాయలో
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడిన 100సంవత్సరాల వయసు గల మహిళ వృద్దురాలు కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న సంఘటన ఇండోనేషియా చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని తన స్వస్థలమైన సురబాయలో దాదాపు ఒక నెలపాటు ఈ మహమ్మారితో పోరాడి కమ్తిమ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. తూర్పు జావా గవర్నర్ ఖోఫీఫా ఇందర్ పరావంసా మాట్లాడుతూ, వృద్దులకు ఇది అతి ప్రమాదాకరం మనందరికీ తెలుసని, అయినప్పటికీ ఈ మహమ్మారిని జయించిన ఈ మహిళ ఎంతోమందికి ధైర్యాన్నిస్తుందన్నారు.
Also Read: 11 మంది దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం..
ఇకపోతే 1920 లో జన్మించిన కమ్తిమ్ నెలక్రితం కరోనా లక్షణాలున్నాయని ఆసుపత్రి చేర్చడంతో వైరస్ సోకినట్లు వైద్యులు తేల్చారు. కాగా కరోనా బాధితురాలి బంధువులు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత వల్లే కోలుకుందని అన్నారు. ప్రతిరోజూ నేను నర్సులతో ఆమె పరిస్థితిని చర్చించేవాళ్లమని, ఆసుపత్రి మందులు, ఇతర సదుపాయాలు త్వరగా కోలుకోవాడనికి ఉపకరించాయన్నారు. మరోవైపు ఇండోనేషియాలో 26,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 1,613 మంది కరోనా బారీగా పడి మరణించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..