Pakistan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-బస్సు ఢీ.. 17 మంది దుర్మరణం..
Pakistan road accident: ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 17 మంది దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరిగింది.
Pakistan road accident: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం జరిగింది. పెషావర్‌కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలోని సింధు రహదారిపై కోహట్ సొరంగం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఖైబర్ ఫక్తున్‌ఖ్వా గవర్నర్ హాజీ గులాం అలీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అజం ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గతంలో..
గత ఆదివారం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ప్రయాణీకుల బస్సు పిల్లర్‌ను ఢీకొని వంతెనపై నుండి పడిపోయిన ఘటనలో మంటలు అంటుకుని 40 మంది దుర్మరణం చెందారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ చట్టాలను పట్టించుకోకపోవడం వల్ల పాకిస్తాన్‌లో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల కిందట పాకిస్థాన్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని పది మందికి పైగా విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 17 మంది మృతి, 90 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook