6-Year-Old Boy Shoots Teacher In America School: అమెరికాలోని వర్జీనియా నగరంలోని ఒక ఎలిమెంటరీ స్కూల్‌లో గన్ ఫైరింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు జరిగాయి, తరగతి గదిలో ఆరేళ్ల విద్యార్థి తన టీచర్‌పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌ ఒకటో తరగతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో విద్యార్థులెవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. వార్తా సంస్థ ఏపీ చెబుతున్న దాని ప్రకారం 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఉపాధ్యాయురాలు కాల్పుల్లో గాయపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదృష్టవశాత్తూ, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆమె పరిస్థితిలో కొంత మెరుగుదల ఉందని అంటున్నారు. తరగతి గదిలో చిన్నారి చేతిలో తుపాకీ ఉందని పోలీసులు గుర్తించి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, కాల్పుల తర్వాత, ఫైరింగ్ జరిగిన వెంటనే తరగతి గదిలో గందరగోళం ఏర్పడి, పిల్లలు అందరూ ఏడుపు ప్రారంభించారు. న్యూపోర్ట్ న్యూస్ పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ మాట్లాడుతూ, 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిందని,  అయితే మధ్యాహ్నానికి ఆమె పరిస్థితిలో స్వల్ప మెరుగుదల కనిపించిందని అన్నారు.


ఇక డ్రూ మాట్లాడుతూ, ' ఈ షూటింగ్ సంఘటన ప్రమాదం కాదని, విద్యార్థి, ఉపాధ్యాయురాలు ఒకరికొకరు తెలుసునని, ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. దీంతో ఆరేళ్ల బుడతడు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాడు. తరగతి గదిలోకి చిన్నారి ఆయుధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


US పాఠశాలల్లో కాల్పుల ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి, అయితే ఇలా చిన్న బుడతడు తన ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన సంఘటన చాలా అరుదనే చెప్పాలి. న్యూపోర్ట్ అనేది ఆగ్నేయ వర్జీనియాలోని ఒక నగరం, ఇది షిప్‌యార్డ్‌లకు ప్రసిద్ధి చెందిన సుమారు 185,000 మంది జనాభాతో ఉన్న ప్రాంతం అని, అక్కడ విమాన వాహక నౌకలు, ఇతర అమెరికా నౌకాదళ నౌకలను నిర్మిస్తుంది.


Also Read: Rohit Shetty Injured: ప్రమాదంలో స్టార్ డైరెక్టర్‌కు గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి !


Also Read: MLA Kannababu: మాకు బాలకృష్ణ, చిరంజీవి ఎవరూ ఎక్కువ కాదు..కానీ పర్మిషన్ ఎందుకంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook