సునామీ విధ్వంసం జరగొచ్చు..!
న్యూ కెలడోనియాలో సోమవారం భూమి కంపించింది. భూకంప తీవ్రత అధికంగా నమోదవడంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం న్యూ కెలడోనియా దేశానికి సునామీ దాడి జరగవచ్చని హెచ్చరించింది.
న్యూ కెలడోనియాలో సోమవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదైందని జియోలాజికల్ సర్వే ఆఫ్ అమెరికా తెలిపింది. న్యూ కెలడోనియా తూర్పు తీరంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, సోమవారం భూకంపం సంభవించే ముందు ఆదివారం ఆర్థరాత్రి కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. కాగా భూకంప తీవ్రత అధికంగా నమోదవడంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం న్యూ కెలడోనియా దేశానికి సునామీ దాడి జరగవచ్చని హెచ్చరించింది. ఈ సునామీ ప్రభావం 300 కోలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. ఆ దేశ రాజధాని నౌమియా తీరానికి 250 కోలోమీటర్ల దూరంలో ఉంది.