Storm Eunice: 'యూనిస్' తుపాన్ (storm Eunice) వాయువ్య ఐరోపాను అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను ధాటికి ఐరోపా ప్రాంతంలో 9 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ గాలులకు భారీ వృక్షాలు నేలకొరగటంతో.. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ గాలులు ధాటికి కొన్నిచోట్ల ప్రజలు నడుచుకుంటూనే రోడ్లమీద పడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'బ్రిటన్‌ను తాకిన బలమైన తుపానుల్లో ఒకటిగా 'యునిస్'​ చరిత్రలో నిలిచిపోతుంది' అని ఆ దేశ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వరుస తుపానులు ఐరోపా దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్​, బెల్జియం, నెదర్లాండ్​, డెన్మార్క్​, జర్మనీ దేశాల్లో తుపాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 


ఈ తుపాన్ ధాటికి బ్రిటన్​లో (UK)​ ముగ్గురు మరణించారు. దక్షిణ ఇంగ్లండ్ లో కారు చెట్టును ఢీకొట్టడంతో..ఒక వ్యక్తి మరణించారు. లండన్‌లో కారుపై చెట్టు పడడంతో 30 ఏళ్ల మహిళ మరణించారు. నెదర్లాండ్స్​లో మరో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బెల్జియంలో బలమైన గాలుల తాకిడికి ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. ఐర్లాండ్​లో నెలకొరిగిన చెట్లను తొలగిస్తుండగా ప్రభుత్వ సిబ్బంది ఒకరు మృత్యువాత పడ్డారు.


Also ReadLassa fever : మార్కెట్లోకి మరో ప్రాణాంతక వ్యాధి... యూకేలో 'లస్సా ఫీవర్‌'తో ముగ్గురు మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి