Xi Jinping Tighten His Grip: చైనా శాస్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు షీ జిన్​పింగ్​కు మార్గం (China Lifetime President) సుగమమైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) నిర్వహించిన నాలుగు రోజుల ప్లీనరీ సమావేశం గురువారంతో ముగిసింది. ఇందులో చారిత్రక తీర్మానానికి ఆమోదం లభించింది. దీనితో వరుసగా (CPC conclave) మూడో సారి కూడా షీ జిన్​పింగ్​ దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

400 మందికిపైగా కేంద్ర కమిటీ సభ్యులతో జరిగిన ఈ కాంక్లేవ్​లో.. వచ్చే ఏడాది జరిగే మహాసభలు సాధికారంగా.. జిన్​ పింగ్​ను అధ్యక్షుడిగా మళ్లీ అధ్యక్షుడిగా (Chinese leader Xi Jinping) నియమించాలని నిర్ణయించింది.


రాజ్యాంగ సవరణతో..


నిజానికి చైనాలో రెండు పర్యాయాలు పదవిలో ఉన్న తర్వాత.. మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు వీలుండదు. అయితే చైనా 2018లో చేసిన రాజ్యంగ సవరణ ద్వారా జిన్​ పింగ్ మూడో సారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది.


Also read: Illegal drugs trade: ఆఫ్గన్‌లో యథేచ్చగా ఓపియం సాగు.. గత్యంతరం లేదంటున్న రైతులు..


ఇదిలా ఉండగా.. జిన్​ పింగ్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి లీ కెకియాంగ్​ సహా ఇతర మంత్రులు, ఉన్నత స్థాయి లీడర్లు మాత్రం వచ్చే ఏడాదితో పదవులను వీడనున్నట్లు తెలుస్తోంది. వారంతా రెండు పూర్తి చేసుకున్న కారణంగా.. కొత్త వారికి ఆ బాధ్యతలు ఇచ్చే అవకాశలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 


జిన్​పింగ్ అధ్యక్ష ఎంపిక సహా.. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలపై సీపీసీ నేడు అధికారిక ప్రకటనలు చేయనుంది.


Also read: Paris Catacombs: పారిస్‌లో భయం గొలిపే మృతదేహాల గోడ, గోడ నిండా శవాలే


Also read: Malala Weds Asser Pics Viral: యాసిర్‌తో నోబుల్ బహుమతి గ్రహీత మలాలా పెళ్లి, ట్రెండ్ అవుతున్న ఫోటోలు


ఇంతకు ముందు కూడా..


100 ఏళ్ల చరిత్ర కలిగిన సీసీపీలో చారిత్రక తీర్మానాన్ని రెండు సార్లు మాత్రమే (తాజాది కాకుండా) ప్రవేశ పెట్టారు. వావో కోసం 1945లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1981లో డెంగ్ షియావోపింగ్​ కోసం.. ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మళ్లీ జిన్ పింగ్​ కోసం చారిత్రక తీర్మానం ప్రవేశపెట్టి సీపీసీ.


పార్లీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, చరిత్ర  గతిని మార్చే ఉద్దేశంతో చారిత్రక తీర్మనాలు ప్రవేశ పెడుతుంది సీపీసీ. దీనితో పాటు.. 2022లో జరిగే సీపీసీ మహా సభలకు వరుసగా మూడో సారి జిన్​ పింగ్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఇందులో జిన్​ పింగ్ వారసుడెవరనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Also read: Imran Khan: ఉగ్రవాదులతో చర్చలా అంటూ.. ఇమ్రాన్ ఖాన్​పై పాకిస్థాన్​ సుప్రీం కోర్టు ఆగ్రహం!


Also read: Security Council: ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, సవాళ్లపై ఢిల్లీలో ముగిసిన భద్రతా సదస్సు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook