Security Council: ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, సవాళ్లపై ఢిల్లీలో ముగిసిన భద్రతా సదస్సు

Security Council: ఆఫ్ఘనిస్తాన్ భద్రతా పరిస్థితులపై ఆసియన్ దేశాలు దృష్టి సారించాయి. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ నేలపై ఉగ్రవాద కార్యకలాపాలు జరగకూడదని ఆసియన్ దేశాలు తీర్మానించాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2021, 06:38 AM IST
  • ఢిల్లీలో ముగిసిన ప్రాంతీయ భద్రతా సదస్సు
  • ఆఫ్ఘన్ సంక్షోభం, సవాళ్లపై ప్రధానంగా సాగిన చర్చ
  • ఆసియా నుంచి 8 దేశాలు హాజరు, గైర్హాజరైన పాకిస్తాన్, చైనా
Security Council: ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, సవాళ్లపై ఢిల్లీలో ముగిసిన భద్రతా సదస్సు

Security Council: ఆఫ్ఘనిస్తాన్ భద్రతా పరిస్థితులపై ఆసియన్ దేశాలు దృష్టి సారించాయి. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ నేలపై ఉగ్రవాద కార్యకలాపాలు జరగకూడదని ఆసియన్ దేశాలు తీర్మానించాయి. 

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం(Afghanistan Crisis) విసురుతున్న సవాళ్లపై ఢిల్లీలో రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై చర్చ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగంపై ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్‌ ఆధ్వర్యంలో జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న 8 ఆసియన్‌ దేశాలు(Asian Countries) ప్రతిజ్ఞ చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఆఫ్ఘనిస్తాన్ అడ్డాగా మారకుండా నిరోధించేందుకు కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన ఆఫ్ఘనిస్తాన్‌ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు స్పష్టం చేశారు. కాబూల్, కాందహార్, కుందుజ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. వివిధ కారణాలతో పాకిస్తాన్, చైనా దేశాలు ఈ సదస్సుకు హాజరు కాలేదు. 

ఆఫ్ఘనిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ(Narendra Modi)ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తరువాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను మోదీ ప్రతిపాదించారు. ఆఫ్ఘన్ భూబాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఆఫ్ఘన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక రచించాలన్నారు. ఆఫ్ఘన్‌లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరుల అకృత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు. 

భద్రతా సదస్సు డిక్లరేషన్ ప్రకారం

ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు(Terrorist Activities) జరగకూడదు. అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తామని.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుతున్న ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)పరిస్థితిపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. ఆఫ్ఘన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలని. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదని తీర్మానించారు. మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు. కోవిడ్‌పై పోరాటానికి ఆఫ్ఘనిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నామని సదస్సు స్పష్టం చేసింది.

Also read: Covid19 Update: రెండేళ్లలో 25 కోట్లమందికి కరోనా వైరస్, హాట్‌స్పాట్‌లు ఆ దేశాలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News