Paris Catacombs: పారిస్‌లో భయం గొలిపే మృతదేహాల గోడ, గోడ నిండా శవాలే

Paris Catacombs: కంటికి అందాల్నే కాదు భయాన్ని గొలిపే ప్రదేశాలు కూడా ప్యారిస్‌లో ఉన్నాయి. కనులకు ఇంపైన ప్రాంతాలే కాకుండా భయం గొలిపే అంతుచిక్కని ప్రదేశాలున్నాయి. ప్యారీస్ కాటకోంబ్స్ ఇందుకు ఉదాహరణ. అసలు ఈ కాటకోంబ్స్ అంటే ఏంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2021, 06:19 AM IST
  • ప్యారిస్ లో భయం గొలుపుతున్న ప్యారిస్ కాటకోంబ్స్
  • 2.2 కిలోమీటర్ల పొడవైన మృతదేహాల గోడ, పెద్దఎత్తున పర్యాటకుల సందర్శన
  • ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరు గాంచిన కాటకోంబ్స్
Paris Catacombs: పారిస్‌లో భయం గొలిపే మృతదేహాల గోడ, గోడ నిండా శవాలే

Paris Catacombs: కంటికి అందాల్నే కాదు భయాన్ని గొలిపే ప్రదేశాలు కూడా ప్యారిస్‌లో ఉన్నాయి. కనులకు ఇంపైన ప్రాంతాలే కాకుండా భయం గొలిపే అంతుచిక్కని ప్రదేశాలున్నాయి. ప్యారీస్ కాటకోంబ్స్ ఇందుకు ఉదాహరణ. అసలు ఈ కాటకోంబ్స్ అంటే ఏంటో చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత భయం గొలిపే ప్రాంతమిది. అందుకే ఇప్పటికీ ఈ ప్రదేశాల్ని పూర్తి స్థాయిలో సందర్శించేందుకు అనుమతి లేదు. ప్యారీస్(Paris)పేరు వినగానే ఈఫిల్ టవర్ ఎలా గుర్తుకు వస్తుందో ఇది కూడా అలానే గుర్తుకు రావల్సిన పరిస్థితి. అంతటి భయం గొలిపే ఆ ప్రాంతం పేరు Paris Catacombs.అక్కడ దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర 18వ శతాబ్ధం చివరి భాగం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. అసలెలా ఏర్పడిందంటే..

చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారు. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంత మరణాలు సంభవించాయి. ఓసారి భారీ వర్షం కురవడంతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారు. అనతికాలంలోనే దాదాపు 60 లక్షల మృతదేహాలు ఇక్కడ నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను(Wall of Dead Bodies and Skulls) నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టారు. అందుకే ఈ స్థలాన్ని సమాధుల నేలమాళిగ (Basement of Tombs)అని పిలుస్తారు. నేడు ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కూడా.

చనిపోయినవారి ఎముకలు, పుర్రెలతో నిర్మించిన 2.2 కి.మీ పొడవున్న ఈ మొత్తం గోడ దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఐతే ఈ మొత్తం గోడను నేటివరకూ పర్యాటకుల సందర్శనకు ఇప్పటివరకూ ఉంచలేదు. ఈ సొరంగంలోని కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది. ఏదిఏమైనప్పటికీ సమాధులను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా అస్థిపంజరాలతో కట్టిన ఈ గోడను చూసేందుకు పర్యాటకులు ఎలా ఆసక్తి చూపిస్తున్నారనేది ఆశ్చర్యమే మరి.

Also read: Gold Mine Collapse: బంగారు గని కూలి...18 దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News