`కరోనా` సోకితే సంతాన యోగం లేదా..?
`కరోనా వైరస్`.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాన్ని గజగజా వణికిస్తున్న పేరు. ప్రపంచ దేశాల్లో 10 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ..ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షా 8 వేల 862 మంది చనిపోయారు. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 8 వేల 356 కేసులు నమోదు కాగా.. అందులో 716 మంది కోలుకున్నారు. 273 మంది చనిపోయారు.
'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాన్ని గజగజా వణికిస్తున్న పేరు. ప్రపంచ దేశాల్లో 10 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ..ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షా 8 వేల 862 మంది చనిపోయారు. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 8 వేల 356 కేసులు నమోదు కాగా.. అందులో 716 మంది కోలుకున్నారు. 273 మంది చనిపోయారు.
'కరోనా వైరస్' గురించి రకరకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ సోకిన పురుషులకు సంతానం యోగం ఉండదనే వార్త ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ జననేంద్రియాలపై దాని ప్రభావం అలాగే ఉంటుందని చైనా వైద్యులు చెప్పడమే ఇందుకు కారణం. కొంత మంది కరోనా రోగులను పరిశీలించిన వుహాన్ లోని టాంజీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లి యుఫెంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. హాస్పిటల్ వెబ్ సైట్లో ఈ అంశాన్ని పోస్ట్ చేశారు. ఐతే ఇదే విషయాన్ని హుబీ ప్రావిన్స్ కూడా ప్రభుత్వ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది.
కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్న వారు కచ్చితంగా సంతానోత్పత్తికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని ప్రొఫెసర్ లి యుఫెంగ్ సూచించారు. ఐతే ఆయన ఆస్పత్రి వెబ్ సైట్లో ప్రచురించిన కథనం చైనా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు కూడా విస్తరించింది.
కానీ ఇంత వరకు కరోనా వైరస్ .. పురుషుల జననేంద్రియాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనేది రుజువు కాలేదు. లి యుఫెంగ్ కేవలం ఒకరిద్దరిపై పరీక్షలు చేసి నిర్దారణకు వచ్చినప్పుడు ప్రపంచ దేశాల సైంటిస్టులు చెబుతున్నారు. అలా ఒకరిద్దరిపై చేసిన పరీక్షల ఆధారణంగా నిర్ణయానికి రాలేమని చెబుతున్నారు. ఇందుకోసం కరోనా బారిన పడి కోలుకున్న పురుషుల నుంచి వీర్యకణాలు సేకరించి.. వాటిపై పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..