Ashraf Ghani:అఫ్గానిస్థాన్‌లో రక్తపాతాన్ని నివారించేందుకు దేశం విడిచివెళ్లానన్నాడు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ. తనకు ఆ మార్గం తప్ప వేరే దారి కనిపించలేదని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఫేస్ బుక్(Facebook) వేదికగా ఆయన ఓ వీడీయో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. అయితే, అందరూ ఆరోపిస్తున్నట్లుగా తాను బ్యాగ్‌ల నిండా డబ్బులేమీ తీసుకెళ్లలేదని, కట్టుబట్టలతో దేశాన్ని విడిచానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను యూఏఈ(UAE)లో ఉన్నట్లు వెల్లడింంచారు. 


Also Read: Afghanistan Currency Value: దేశంలో నెలకొన్న పరిణామాలతో పడిపోయిన ఆఫ్ఘన్ కరెన్సీ


'దేశహితం కోసమే వెళ్లాల్సి వచ్చిందని కానీ..స్వార్థంతో కాదని..అలాగైనా ఈ రక్తపాతం, అల్లర్లు ఆగుతాయని అనుకున్నానని..ఘనీ(Ashraf Ghani) చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఎమిరేట్స్ లో ఉన్నట్లు వెల్లడించారు. పెద్ద మెుత్తంలో డబ్బులు తరలించానని చాలా మంది చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని..వాటిని ఖండిస్తున్నట్లు ఘనీ చెప్పారు. తీవ్రమైన ముప్పు ఉందని నా భద్రతా సిబ్బంది చెప్పటంతోనే..ఆలోచించకుండా కనీసం నా కాళ్లకున్న చెప్పులు మార్చుకునే అవకాశం కూడా లేకుండా వెళ్లిపోయానని ఘనీ వాపోయారు. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వచ్చేశాను. కావాలంటే ఈ విషయాన్ని యూఏఈ కస్టమ్స్‌ అధికారులతో కూడా ధ్రువీకరించుకోవచ్చు. నేను అక్కడే ఉంటే అఫ్గాన్‌(Afghanistan) ప్రజల కళ్లముందే ఓ అధ్యక్షుడు ఉరికి వేలాడాల్సి వచ్చేది’’ అని ఘనీ చెప్పుకొచ్చారు.


తాలిబన్లు, ప్రభుత్వ ప్రతినిధులతో తన మద్దతుదారులు చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే దేశానికి వచ్చే అవకాశాలున్నాయని ఘనీ చెప్పారు. కాబుల్‌(Kabul)ను వీడిన తర్వాత ఆయన పోస్ట్‌ చేసిన తొలి వీడియో సందేశం ఇది. ఘనీ గత ఆదివారం దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెళ్లిపోయేప్పుడు దేశ ఖజానా నుంచి 160 మిలియన్ల డాలర్ల డబ్బు తస్కరించారని తజికిస్థాన్‌(Tajikistan‌)లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి మొహమ్మద్‌ జహీర్‌ అఘ్‌బార్‌(Mohammed Zaheer Aghbar) తీవ్ర ఆరోపణలు చేశారు. ఘనీ పెద్ద ఎత్తున డబ్బుతో పరారైనట్లు రష్యా(Russia) కూడా అరోపించింది. ఘనీ, ఆయన కుటుంబసభ్యులను మానవతా దృక్పథంతో తమ దేశంలోకి అనుమతించినట్లు యూఏఈ(UAE) తెలిపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook